AUS vs SA: 10 ఓవర్లు.. 3 మెయిడెన్లు.. 5 వికెట్లు.. సూపర్‌ స్పెల్‌తో సఫారీలను బెంబేలెత్తించిన రూ.17.5 కోట్ల ఆటగాడు

|

Dec 26, 2022 | 2:07 PM

ఐపీఎల్ వేలంలో తనపై కోట్ల వర్షం ఎందుకు కురిసిందో 23 ఏళ్ల ఆల్ రౌండర్‌ క్యామెరూన్ గ్రీన్ మరోసారి నిరూపించాడు. అతనిని  కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎందుకు తహతహలాడాయి? ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా ఎందుకు నిలిచాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలన్నింటికీ బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజునే సమాధానమిచ్చాడు.

AUS vs SA: 10 ఓవర్లు.. 3 మెయిడెన్లు.. 5 వికెట్లు.. సూపర్‌ స్పెల్‌తో సఫారీలను బెంబేలెత్తించిన రూ.17.5 కోట్ల ఆటగాడు
Aus Vs Sa
Follow us on

ఇక్కడ డబ్బు వర్షం కురిసింది, అక్కడ వికెట్ల వర్షం కురిసింది. ఐపీఎల్ వేలంలో తనపై కోట్ల వర్షం ఎందుకు కురిసిందో 23 ఏళ్ల ఆల్ రౌండర్‌ క్యామెరూన్ గ్రీన్ మరోసారి నిరూపించాడు. అతనిని  కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎందుకు తహతహలాడాయి? ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా ఎందుకు నిలిచాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలన్నింటికీ బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజునే సమాధానమిచ్చాడు. మెల్‌బోర్న్‌ మైదానం వేదికగా సోమవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో గ్రీన్‌ చెలరేగాడు. ఐదు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు. క్యామెరూన్‌ అద్భుత బౌలింగ్ ఫలితంగా దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు కూడా చేయలేకపోయింది. కేవలం 189 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఆరో వికెట్‌కు మార్కో జాన్సన్, కైల్ వారిన్ సెంచరీ భాగస్వామ్యం జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. కాగా ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు మరో 4 వికెట్లు తీసి మొదటి రోజు ఆటలో హీరోగా నిలిచాడు గ్రీన్‌. 23 ఏళ్ల కుడిచేతి వాటం ఆల్ రౌండర్ బంతితో అద్భుతాలు చేశాడు. మొత్తం 10.5 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు తీశాడీ ఐపీఎల్ హీరో.

ముంబై ఇండియన్స్‌ హ్యాపీ..

కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో గ్రీన్‌ను 17.5 కోట్లు కురిపించి సొంతం చేసుకుంది. ఇది జరిగిన మూడు రోజుల్లోనే గ్రీన్‌ బంతితో చెలరేగడం విశేషం. గ్రీన్‌ సూపర్‌ స్పెల్‌తో అటు ఆస్ట్రేలియా జట్టుతో పాటు ముంబై ఇండియన్స్‌ కూడా ఎంతో సంబరపడి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ రెండు సెషన్లలో బౌలింగ్ చేశాడు. తొలుత అతనికి ఒక వికెట్ మాత్రమే దక్కింది. అయితే రెండో సెషన్‌లో చెలరేగాడు. మొదట బ్రన్ వికెట్ తీశాడు. ఆతర్వాత కైల్ వారిన్‌ను అవుట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న ఆరో వికెట్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత కగిసో రబడ, లుంగీ నగిడిలను కూడా పెవిలియన్‌కు పంపించాడు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..