Pat Cummins: ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన ఆసీస్‌ కెప్టెన్‌.. 9 నెలల పిల్లాడి సమక్షంలో ..

Pat Cummins Marriage: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు బెక్కి బోస్టన్‌ (Becky Boston) తో కలిసి శనివారం పెళ్లిపీటలెక్కాడు.

Pat Cummins: ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన ఆసీస్‌ కెప్టెన్‌.. 9 నెలల పిల్లాడి సమక్షంలో ..
Pat Cummins

Edited By:

Updated on: Aug 01, 2022 | 3:53 PM

Pat Cummins Marriage: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు బెక్కి బోస్టన్‌ (Becky Boston) తో కలిసి శనివారం పెళ్లిపీటలెక్కాడు. 2013లో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరు అప్పటి నుంచే ప్రేమలో మునిగితేలుతున్నారు. 2020లో ఉంగరాలు మార్చుకుని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది. అయితే రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట 2021 అక్టోబర్‌లో ఆల్బీ అనే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో పిల్లాడు పుట్టిన తొమ్మిది నెలలకు వేడుకగా వివాహం చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. క్రికెటర్లు ట్రావిడ్‌ హెడ్‌, టిమ్‌ఫైన్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌, జోష్‌ హాజెల్‌వుడ్‌ తదితర క్రికెటర్లు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

ఎల్లలు దాటిన ప్రేమ

కాగా కమిన్స్‌ది ఆస్ట్రేలియా.. అదే సమయంలో బోస్టన్‌ది ఇంగ్లండ్‌. క్రికెట్‌లో ఈ రెండు దేశాలను చిరకాల ప్రత్యర్థులుగా భావిస్తారు. అయితే కమిన్స్‌, బోస్టన్‌ల ప్రేమ మాత్రం ఖండాంతరాలు దాటింది. కాగా వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కమిన్స్‌ 2011లో 18 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 43 టెస్టుల్లో 199 వికెట్లు, 73 వన్డేల్లో 119 వికెట్లు, 39 టీ20ల్లో 44 వికెట్లు తీశాడు. కాగా టిమ్‌ పైన్‌ తర్వాత టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమిన్స్‌ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..