ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women’s World Cup 2022) లో పాకిస్థాన్ కష్టాలు పెరిగాయి. ఎందుకంటే భారత్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా (Australia Women)పై కూడా ఓటమి చవిచూసింది. ఇలా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టోర్నీలో ముందుకు వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. టోర్నీ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు పాకిస్థాన్ 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ జట్టుకు ఇది రెండో అతిపెద్ద స్కోరు. అయినప్పటికీ వారు డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. అలిస్సా హీలీ(Alyssa Healy) అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది.
తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 12 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా, పాక్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఓడిపోయింది.
పాకిస్థాన్‌ను షేక్ చేసిన హిల్లీ!
పాకిస్థాన్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. అయితే ఇంగ్లండ్‌పై పటిష్ట ఇన్నింగ్స్ ఆడిన రాచెల్ హన్స్ పాకిస్థాన్‌పై 34 పరుగులు చేసి ఔటైంది. కానీ, అలిస్సా హీలీ మరో ఎండ్‌లో రాచెల్ హాన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించింది. ఆ తర్వాత రెండో వికెట్‌కు కెప్టెన్ మెగ్ లానింగ్‌తో కలిసి మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. 35 పరుగుల వద్ద లానింగ్ ఔటయింది. అదే సమయంలో అలిస్సా హీలీ అర్ధ సెంచరీ పూర్తి చేసింది.
అలిస్సా హీలీ 79 బంతుల్లో 72 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. దీని తర్వాత పెర్రీ, మూనీ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. పెర్రీ 26 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, మూనీ 23 పరుగులు చేసింది.
ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..