ICC T20 World Cup Australia vs India 1st innings score: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు కేవలం 41 బంతుల్లో 92 రన్స్ కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, 8 ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 31, 3ఫోర్లు ,2 సిక్సర్లు), శివం దుబే (22 బంతుల్ 28), హార్దిక్ పాండ్య ( 17 బంతుల్లో 27 నాటౌట్), జడేజా ( 5 బంతుల్ 9 నాటౌట్) కూడా మోస్తరుగా రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ కేవలం 8 పరుగుల తేడాతో రోహిత్ శర్మ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.
నిజానికి గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మను ఎడమచేతి వాటం బౌలర్లు ఔట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే ఇది కూడా నిజమే. ఇది ప్రపంచకప్‌లోనే పదే పదే రుజువైంది. అందుకే ముఖ్యమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వి ఎడమచేతి వాటం ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే రోహిత్ మాత్రం మిచెల్ స్టార్క్‌పై ఎదురు దాడికి దిగాడు.స్టార్క్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. మొత్తం 4 సిక్స్ లు, ఒక బౌండరీతో మిచెల్ కు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ స్టార్క్ బౌలింగ్ లో భారీగా పరుగులు సాధించాడు రోహిత్. అయితే ఆఖరికి అతని బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డయ్యాడు.
Innings Break!
Captain Rohit Sharma led from the front as #TeamIndia post a total of 205/5 🙌
Over to our bowlers now! 👍
Scorecard ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #AUSvIND pic.twitter.com/djk7WWCvI6
— BCCI (@BCCI) June 24, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..