
Nathan Lyon Break Record of most wicket in Test for Australia: ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు నాథన్ లైయన్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన లైయన్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి గ్లెన్ మెక్‌గ్రాత్ (563 వికెట్లు) రికార్డును తుడిచిపెట్టేశాడు.
ఈ మ్యాచ్‌కు ముందు లైయన్ 562 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో మొదట ఓలీ పోప్‌ను అవుట్ చేసి మెక్‌గ్రాత్ రికార్డును సమం చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి బెన్ డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి 564వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అవతరించాడు.
ఆస్ట్రేలియా తరపున షేన్ వార్న్ (708 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు లైయన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లైయన్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ తన 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 124 మ్యాచ్‌లు ఆడి, 563 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో, అతను 29 ఐదు వికెట్లు, మూడుసార్లు పది వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్ చివరి టెస్ట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత, నాథన్ లియాన్ ఇప్పుడు తన టెస్ట్ వికెట్ల సంఖ్యను అధిగమించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేయడం ద్వారా లియాన్ తన 564వ టెస్ట్ వికెట్‌ను తీసుకున్నాడు. లియాన్ తన 141 టెస్ట్‌లలో 261వ ఇన్నింగ్స్‌లో మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు.
విశేషమేమిటంటే, లైయన్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభానికి ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలోనే పిచ్ క్యూరేటర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అదే మైదానంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికార్డును అధిగమించడం ఒక సినిమా లెవల్ ట్విస్ట్ అని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.
Glenn McGrath’s reaction to Nathan Lyon passing him on the all-time Test wickets list was absolutely hilarious 🤣 #Ashes pic.twitter.com/1jTM06M8me
— cricket.com.au (@cricketcomau) December 18, 2025
లైయన్ తన రికార్డును బద్దలు కొట్టిన సమయంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంట్రీ బాక్స్‌లో ఉన్నాడు. తన రికార్డు పోయిందని సరదాగా నటిస్తూ, పక్కనే ఉన్న కుర్చీని విసిరేయబోతున్నట్లు మెక్‌గ్రాత్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన రికార్డును ఒక స్పిన్నర్ అధిగమించడంపై ఆయన చిరునవ్వుతో హర్షం వ్యక్తం చేశారు.
షేన్ వార్న్: 708 వికెట్లు
నాథన్ లైయన్: 564* వికెట్లు
గ్లెన్ మెక్‌గ్రాత్: 563 వికెట్లు
మిచెల్ స్టార్క్: 420 వికెట్లు
38 ఏళ్ల వయసులోనూ లైయన్ పట్టుదల చూస్తుంటే, ఆయన మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..