
Ravichandran Ashwin As Team India Captain: క్రికెట్ ప్రపంచ కప్ 2023తో పాటు, ఆసియా క్రీడలు 2023కి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈసారి ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ జట్టుతో పాటు పురుషుల జట్టు కూడా టోర్నీలో పాల్గొననుంది. అదే సమయంలో భారత సీనియర్ జట్టు ప్రపంచకప్‌నకు సిద్ధమవుతుంది. కాబట్టి భారత్‌కు చెందిన బి జట్టును ఆసియా క్రీడలకు పంపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందుకోసం రవిచంద్రన్ అశ్విన్‌ని భారత కెప్టెన్‌గా చేయాలని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
కార్తీక్ మాట్లాడుతూ.. “అశ్విన్ గొప్ప ఆటగాళ్ళలో ఒకడు. అతను నాణ్యమైన బౌలింగ్ చేస్తూ ఎన్నో వికెట్లు తీశాడు. ఆసియా క్రీడల్లో బి జట్టుకు అశ్విన్‌కి కెప్టెన్‌గా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో భారత ప్రధాన జట్టు ప్రపంచకప్‌కు సిద్ధమవుతుంది. అశ్విన్ ఈ జట్టులో భాగం కాకపోతే, ఆసియా క్రీడలకు అతనిని కెప్టెన్‌గా చేయాలి. అశ్విన్ ఇందుకు అర్హుడని నేను భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
విశేషమేమిటంటే, టీమిండియా అత్యుత్తమ ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. అతను ఇప్పటివరకు 92 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 3129 పరుగులతో పాటు 474 వికెట్లు తీశారు. అతను 113 వన్డేలు కూడా ఆడాడు. ఈ ఫార్మాట్‌లో అశ్విన్ 707 పరుగులు చేయడంతోపాటు 151 వికెట్లు కూడా తీశాడు. ఆర్. అశ్విన్ టెస్టుల్లో 5 శతకాలు, 13 అర్థ శతకాలు సాధించాడు. టీమిండియా తరపున 65 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇందులో 72 వికెట్లు పడగొట్టాడు.
ఆసియా క్రీడల్లో క్రికెట్ పునరాగమనం చాలా కాలం తర్వాత తిరిగి వచ్చింది. 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్ కూడా చేర్చారు. కానీ, భారత్ జట్టును పంపలేదు. ఆ తర్వాత క్రికెట్ ఆసియా క్రీడల్లో. దీని తర్వాత 2022లో భారత మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..