Mohsin Naqvi : ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై బీసీసీఐ సంచలన నిర్ణయం.. మోహ్సిన్ నఖ్వీ జైలుకు వెళ్తారా?

ఆసియా కప్ ఫైనల్ ట్రోఫీ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. భారత జట్టు విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అక్రమంగా తన అధీనంలో ఉంచుకోవడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ విషయంలో మోహ్సిన్ నఖ్వీపై బీసీసీఐ దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.

Mohsin Naqvi : ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై బీసీసీఐ సంచలన నిర్ణయం.. మోహ్సిన్ నఖ్వీ జైలుకు వెళ్తారా?
Mohsin Naqvi

Updated on: Oct 02, 2025 | 7:03 AM

Mohsin Naqvi : ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసినా, ట్రోఫీ చుట్టూ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ ట్రోఫీ వివాదం ఇప్పుడు ఏకంగా దుబాయ్ పోలీసుల వద్దకు చేరే అవకాశం ఉంది. భారత జట్టు చారిత్రక విజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని మాయం చేశారని, దానిని తిరిగి ఇవ్వడానికి మొండిగా నిరాకరిస్తున్నారని సమాచారం. ట్రోఫీని తన వద్దే ఉంచుకున్న నఖ్వీ, భారత జట్టు కెప్టెన్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫీసుకు వచ్చి తీసుకుంటేనే ఇస్తానని పట్టుబడుతున్నారట. నఖ్వీ మొండితనం కారణంగా ఇప్పుడు బీసీసీఐ ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఆసియా కప్ ఫైనల్ ట్రోఫీ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. భారత జట్టు విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అక్రమంగా తన అధీనంలో ఉంచుకోవడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ విషయంలో మోహ్సిన్ నఖ్వీపై బీసీసీఐ దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ట్రోఫీ దొంగిలించడం, దానిని అక్రమంగా తన వద్ద ఉంచుకోవడంపై ఫిర్యాదు నమోదు అయ్యే అవకాశం ఉంది. ట్రోఫీని తిరిగి అప్పగించడానికి బీసీసీఐ నఖ్వీకి కేవలం 72 గంటల గడువు మాత్రమే ఇచ్చింది. గడువులోగా ట్రోఫీని ఇవ్వకపోతే, నఖ్వీపై చట్టపరమైన చర్యలు తప్పవు.

ట్రోఫీతో పాటు మోహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు బీసీసీఐ యూఏఈ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాకుండా, నఖ్వీని ఆయన పదవి నుంచి తొలగించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ మోహ్సిన్ నఖ్వీపై దుబాయ్‌లో దొంగతనం కేసు నమోదైతే, ఆయనకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. దుబాయ్ చట్టాల ప్రకారం, దొంగతనం కేసుల్లో జరిమానాతో పాటు 5 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో 15 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మోహ్సిన్ నఖ్వీ బీసీసీఐ అధికారులకు క్షమాపణ చెప్పారని మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ, పీసీబీ చీఫ్ దీనిని పూర్తిగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నఖ్వీ తన మొండి పట్టుదలను కొనసాగిస్తూ.. ఆసియా కప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా తన వద్దకు వచ్చి ఆ ట్రోఫీని తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ట్రోఫీని అక్రమంగా అట్టిపెట్టుకోవడమే కాకుండా, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..