Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టైటిల్ పోటీదారుగా బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో విజయవంతంగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హిట్‌మ్యాన్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో, భారత్ తన మొదటి మ్యాచ్‌ని సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ దృష్టిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలలో అతని రికార్డు అద్భుతంగా నిలిచింది.
ఆసియా కప్‌లో విషయానికి వస్తే ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఛేజింగ్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 534 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 529 పరుగులు చేశాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 452 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. 391 పరుగులతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ 380 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
534 పరుగులు – రోహిత్ శర్మ
529 పరుగులు – విరాట్ కోహ్లీ
452 పరుగులు – సచిన్ టెండూల్కర్
391 పరుగులు – నవజోత్ సిద్ధూ
380 పరుగులు – శిఖర్ ధావన్
347 పరుగులు – ఏ రణతుంగ
332 పరుగులు – గౌతం గంభీర్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో జరిగిన వన్డే క్రికెట్‌లో సత్తా చాటాడు. వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్ జట్టుపై అతని బ్యాట్ పరుగుల వర్షం కురిపించింది. రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై 16 ఇన్నింగ్స్‌లలో 51.42 సగటుతో 2 సెంచరీలు , 6 అర్ధ సెంచరీలతో 720 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 88.77లుగా నిలిచింది. పాక్ జట్టుపై వన్డేల్లో హిట్‌మ్యాన్ అత్యుత్తమ స్కోరు 140 నాటౌట్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..