Asia Cup 2025 : ఆసియా కప్‌లో టీమిండియాను గెలిపించే ముగ్గురు మొనగాళ్లు వీళ్లే..అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు మామ

సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈసారి కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియాలోకి దాదాపు ఒక సంవత్సరం తర్వాత శుభ్‌మన్ గిల్ వైస్-కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు.

Asia Cup 2025 :  ఆసియా కప్‌లో టీమిండియాను గెలిపించే ముగ్గురు మొనగాళ్లు వీళ్లే..అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు మామ
Suryakumar Yadav

Updated on: Aug 24, 2025 | 2:36 PM

Asia Cup 2025 : ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకోసం భారత జట్టు రెడీగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యుల భారత జట్టు కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్‌లో జట్టులో ఉన్న కొంతమంది యంగ్ బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శన అందించి జట్టుకు విజయాన్ని అందిస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు మొనగాళ్లు ఈ టోర్నమెంట్‌లో అద్భుతాలు సృష్టిస్తారని నిపుణులు భావిస్తున్నారు.

1. సూర్యకుమార్ యాదవ్

టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతని టీ20ఐ రికార్డు చాలా బాగుంది. 167 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించగల సూర్య, ఐపీఎల్ 2025లో 717 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతని సగటు 65.18. ఈ గణాంకాలు చూస్తుంటే, అతను ఆసియా కప్‌లో కూడా జట్టుకు ప్రధాన స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పవచ్చు.

2. శుభ్‌మన్ గిల్

దాదాపు ఒక సంవత్సరం తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 750కి పైగా పరుగులు, ఐపీఎల్ 2025లో 156 స్ట్రైక్ రేట్‌తో 650 పరుగులు చేశాడు. గిల్ ఆసియా కప్‌లో కూడా బ్యాటింగ్‌లో ఆధిపత్యం చలాయిస్తాడని భావిస్తున్నారు. అందుకే అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించారు.

3. తిలక్ వర్మ

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అతను 25 టీ20 మ్యాచ్‌లలో 50 సగటుతో 749 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 155.07. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో టీమిండియాకు ఒక కీలక ఆటగాడుగా నిలుస్తాడని నిపుణులు చెబుతున్నారు.

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.

టీమిండియా ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎలో పాకిస్తాన్, ఒమన్, యూఏఈ జట్లతో తలపడుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసి సూపర్ ఫోర్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబిలో జరగనున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..