Asia Cup 2025: ఆసియా కప్‎కు ఇప్పటివరకు ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయి? ఇంకా ఎన్ని జట్ల వివరాలు రావాలి?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తో సహా మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. అయితే, అన్ని జట్లు ఇంకా తమ స్క్వాడ్స్‌ను ప్రకటించలేదు. కొన్ని జట్లు మాత్రం ఇప్పటికే తమ జట్లను ఖరారు చేశాయి.

Asia Cup 2025: ఆసియా కప్‎కు ఇప్పటివరకు ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయి? ఇంకా ఎన్ని జట్ల వివరాలు రావాలి?
Asia Cup 2025

Updated on: Aug 21, 2025 | 12:20 PM

Asia Cup 2025: ఆసియా కప్ 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. భారత్, పాకిస్థాన్‌తో సహా మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు తమ జట్లను ప్రకటించగా, మరికొన్ని దేశాలు తమ స్క్వాడ్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్ ఎంపికయ్యారు.

ఆసియా కప్ 2025లో పాల్గొనే జట్లు

ఈసారి ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 4 జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత, రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సూపర్ 4 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత టాప్-2 జట్లు సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్‌లో తలపడతాయి.

గ్రూప్ ఏ: భారత్, ఒమన్, యూఏఈ, పాకిస్థాన్

గ్రూప్ బీ: ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్

ఇప్పటివరకు టీమ్‌లను ప్రకటించిన దేశాలు

భారత్:

స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.

పాకిస్థాన్:

స్క్వాడ్: సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.

బంగ్లాదేశ్:

స్క్వాడ్: లిటన్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, మహ్మద్ నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హుస్సేన్ ఇమాన్, తౌహీద్ హృదోయ్, జాకీర్ అలీ అనిక్, మెహదీ హసన్ మీరాజ్, షమీమ్ హసన్ పట్వారీ, నజ్ముల్ హసన్ శాంటో, రిషాద్ హసన్, షాక్ మెహదీ హసన్, తన్వీర్ ఇస్లాం, నాసుమ్ అహ్మద్, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖాలిద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహీదుల్ ఇస్లాం భుయియాన్, సైఫ్ హసన్.

ఆఫ్ఘనిస్తాన్:

స్క్వాడ్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సదీకుల్లా అటల్, వఫివుల్లా తర్ఖీల్, ఇబ్రహీం జద్రాన్, దర్వేష్ రసూలీ, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, నంగ్యాల్ ఖరోటి, షర్ఫుద్దీన్ అష్రఫ్, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, గుల్బదిన్ నయీబ్, మజీబ్ జద్రాన్, ఎ.ఎం. గజ్నఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ఫరీద్ మాలిక్, సలీమ్ సఫీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, బషీర్ అహ్మద్.

ఇంకా తమ జట్లను ప్రకటించని దేశాలు

ఆసియా కప్ 2025 కోసం ఒమన్, యూఏఈ, శ్రీలంక, హాంకాంగ్ జట్లు తమ స్క్వాడ్‌లను ఇంకా ప్రకటించలేదు. అభిమానులు ఈ జట్ల ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.