Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య మూడు మ్యాచులు.. అత్యధికంగా కప్ గెలిచిన జట్టు ఏదో తెలుసా ?

క్రికెట్ అభిమానుల ఆసక్తి అంతా ఇప్పుడు ఏషియా కప్ 2025పైనే ఉంది. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబి నగరాల్లో జరగనుంది. ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఇది ఆసియా కప్ 17వ ఎడిషన్ కావడం విశేషం.

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య మూడు మ్యాచులు.. అత్యధికంగా కప్ గెలిచిన జట్టు ఏదో తెలుసా ?
Asia Cup 2025

Updated on: Aug 17, 2025 | 9:43 AM

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సందడి మొదలైంది. క్రికెట్ అభిమానుల ఆసక్తి అంతా ఇప్పుడు ఆసియా కప్ 2025పైనే ఉంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబిలో జరగనుంది. ఆసియా కప్ చరిత్రలో ఇది 17వ ఎడిషన్. ఈసారి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. వాస్తవానికి, ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగడం ఇది మూడోసారి మాత్రమే. మిగిలిన 14 సార్లు వన్డే ఫార్మాట్‌లో జరిగింది. ఆసియా కప్ ఎప్పుడు మొదలైంది? ఏ జట్లు ఎన్నిసార్లు ట్రోఫీ గెలిచాయి? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియాలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ అయిన ఆసియా కప్‌ను 1984లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రారంభించింది. 2016 నుంచి ఈ టోర్నమెంట్ ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ల ఫార్మాట్‌కు అనుగుణంగా వన్డే లేదా టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడం వల్ల అభిమానులకు మరింత ఉత్సాహం లభిస్తుంది.

ఆసియా కప్ చరిత్రలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఆధిపత్యం చెలాయించాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌లు ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఈ టోర్నీలో అత్యధికంగా విజయం సాధించిన జట్టు భారత్. ఇప్పటివరకు భారత్ ఏకంగా 8 సార్లు (1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018, 2023) విజేతగా నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక 6 సార్లు (1986, 1997, 2004, 2008, 2014, 2022) ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ కూడా 2 సార్లు (2000, 2012) విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్‌కు చేరినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది.

ఈసారి ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన విషయం భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అంటే కనీసం లీగ్ దశలో ఒక మ్యాచ్ ఆడతాయి. ఒకవేళ ఇరు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌లోకి వెళ్తే, అక్కడ మరోసారి తలపడతాయి. ఇక ఫైనల్‌కు కూడా చేరితే, టైటిల్ కోసం మరోసారి పోరాడతాయి. ఈసారి భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..