Asia Cup 2023: ఆసియాకప్ షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్.. ఒక్క మ్యాచ్ కోసం పాకిస్తాన్ వెళ్లనున్న టీమిండియా.. ఎప్పుడంటే?

|

Jul 20, 2023 | 11:31 AM

India vs Pakistan: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతున్నాయి. భారత్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. అయితే ప్రస్తుత షెడ్యూల్ మారకుంటే ఒక్క మ్యాచ్ కోసమే పాక్ గడ్డపై టీమిండియా అడుగు పెట్టాల్సి ఉంటుంది.

Asia Cup 2023: ఆసియాకప్ షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్.. ఒక్క మ్యాచ్ కోసం పాకిస్తాన్ వెళ్లనున్న టీమిండియా.. ఎప్పుడంటే?
Ind Vs Pak Asia Cup 2023
Follow us on

India Vs Pakistan: ఎట్టకేలకు ఎన్నో ఊహాగానాల మధ్య ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌లోనే విడుదలైంది. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. క్రికెట్ బిగ్ బాస్‌ల ముందు మోకరిల్లిన పాకిస్తాన్.. ఇప్పుడు ముందుగా నిర్ణయించిన విధంగా హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించడానికి అంగీకరించింది. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతున్నాయి. భారత్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. అయితే ప్రస్తుత షెడ్యూల్ మారకుంటే ఒక్క మ్యాచ్ కోసమే పాక్ గడ్డపై టీమిండియా అడుగు పెట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అందులో మొదటి మ్యాచ్ ముల్తాన్‌లో పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ మధ్య జరగనుంది. లాహోర్‌లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. లాహోర్‌లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. అలాగే, సూపర్ ఫోర్ దశలో, ఏకైక మ్యాచ్ పాకిస్తాన్‌లో జరుగుతుంది. ఇందులో గ్రూప్ ఏలో మొదటి స్థానంలో ఉన్న జట్టు, గ్రూప్ బీలో రెండవ స్థానంలో ఉన్న జట్టు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు ఆటంకంలా మారింది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ గడ్డపై సూపర్ 4లో తొలి మ్యాచ్..

షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ గ్రూప్‌ ఏలో ఉంది. ఇలా లీగ్ దశలో టీమిండియా అన్ని మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే.. సూపర్ ఫోర్ దశలో గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడేందుకు లాహోర్ వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే సూపర్ ఫోర్ దశ తొలి మ్యాచ్ లాహోర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని మనం షెడ్యూల్‌లో కూడా గమనించవచ్చు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. ఇలా లీగ్ దశలో భారత్ తొలిస్థానం దక్కించుకుంటే.. సూపర్ ఫోర్ దశ తొలి మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

సూపర్‌ఫోర్‌ దశలో భారత్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో ఉంటే.. శ్రీలంకలో మ్యాచ్‌ ఆడవచ్చు. ఎందుకంటే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12న కొలంబోలో జరిగే సూపర్ ఫోర్ దశలో గ్రూప్ Aలో 2వ స్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ Bలో 1వ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.

మూడు జట్లు.. రెండు గ్రూపులు..

ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు ఉన్నాయి. మూడు జట్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌లు ఒక గ్రూపులో అంటే గ్రూప్‌-ఏలో ఉన్నాయి. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీIndia vs Pakistan: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతున్నాయి. భారత్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. అయితే ప్రస్తుత షెడ్యూల్ మారకుంటే ఒక్క మ్యాచ్ కోసమే పాక్ గడ్డపై టీమిండియా అడుగు పెట్టాల్సి ఉంటుంది.లంక జట్లు గ్రూప్‌-బిలో చోటు దక్కించుకున్నాయి. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్‌కి అర్హత సాధిస్తాయి. భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్లూ సూపర్‌ఫోర్‌కు చేరుకోవడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..