IND Vs PAK: ఎల్లుండే భారత్, పాక్ పోరు.. అంతలోనే బాబర్ సేనకు బిగ్ షాక్.. మ్యాచ్‌కి ఆ స్టార్ బౌలర్‌ దూరం..!

|

Aug 31, 2023 | 4:43 PM

IND vs PAK: టీమిండియాకు కోహ్లీ ఎంత బలమో.. బాబర్ సేనకు షాహీన్ అఫ్రిదీ అంత బలం. అయితే ఎల్లుండే భారత్‌తో తలపడే పాకిస్తాన్ జట్టులో షాహీన్ అఫ్రిదీ దూరం అవుతాడేమోనన్న భయం బాబర్ సేనకు పట్టుకుంది. అవును, బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా తన కోటా బౌలింగ్ పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. అతని స్థానంలో మహ్మాద్ హారీస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అఫ్రిదికి అయిన గాయం తీవ్రత ఎలాంటిదన్న..

IND Vs PAK: ఎల్లుండే భారత్, పాక్ పోరు.. అంతలోనే బాబర్ సేనకు బిగ్ షాక్.. మ్యాచ్‌కి ఆ స్టార్ బౌలర్‌ దూరం..!
IND vs PAK ; Asia Cup 2023
Follow us on

IND Vs PAK: ఆసియా కప్ కోసం శ్రీలంక చేరుకున్న భారత్.. ఎల్లుండే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. భారత్, పాక్ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ ఎంత బలమో.. బాబర్ సేనకు షాహీన్ అఫ్రిదీ అంత బలం. అయితే ఎల్లుండి భారత్‌తో తలపడే పాకిస్తాన్ జట్టులో షాహీన్ అఫ్రిదీ దూరం అవుతాడేమోనన్న భయం బాబర్ సేనకు పట్టుకుంది. అవును, బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా తన కోటా బౌలింగ్ పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. అతని స్థానంలో మహ్మాద్ హారీస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అఫ్రిదికి అయిన గాయం తీవ్రత ఎలాంటిదన్న దానిపై క్లారిటీ లేదు కానీ రేపటి మ్యాచ్‌కు అతను దూరం అయ్యే అవకాశం ఉందంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే పాక్ జట్టు టీమిండియా ముందు నిలవడం కష్టమే అవుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేమిటంటే..

భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది అడకపోతే బాబర్ సేన తరపున ఓపెనింగ్ ఓవర్లలో టీమిండియాను కట్టడి చేయడం మిగిలిన బౌలర్ల తరం కాదు. అలాగే కొత్త బంతితో వికెట్లు తీయగల స్పెషాలిటీ పాక్ బౌలర్లలో అఫ్రిదికి మాత్రమే ఉంది. ఇంకా పవర్ ప్లేలో పరుగులను కట్టడి చేయగల అతని బౌలింగ్ లేకపోతే టీమిండియా బ్యాటర్లు ఇక రెచ్చిపోతారు. పాక్ జట్టులోని మిగిలిన బౌలర్లతో పోల్చుకుంటే షాహీన్ అఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్. ఇంకా అతను ఓపెనింగ్ ఓవర్లే కాక, డెత్ ఓవర్లను కూడా సమర్థవంతంగా బౌల్ చేయగలడు. మరి భారత్‌తో జరిగే రేపటి మ్యాచ్ కోసం పాక్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో అతను ఉంటాడో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌లో  ఎవరున్నా ‘కింగ్’ తగ్గేదేలే.. 

భారత్ VS పాక్ మ్యాచ్‌కి ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిది/మహ్మద్ హారీస్, హరీస్ రవూఫ్.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..