Asia cup 2023 India vs Nepal Match Result: సూపర్ 4 చేరిన భారత్.. సెప్టెంబర్ 10న పాక్‌తో మ్యాచ్..

Asia cup 2023 India vs Nepal: క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. వర్షం వచ్చేసరికి భారత్ 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ఇటువంటి పరిస్థితిలో, అంపైర్లు DLS పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు అందించారు. ఈ టార్గెట్‌ను రోహిత్-గిల్ జోడీ 20.1 ఓవర్లలో సాధించారు.

Asia cup 2023 India vs Nepal Match Result: సూపర్ 4 చేరిన భారత్.. సెప్టెంబర్ 10న పాక్‌తో మ్యాచ్..
Ind Vs Nep Result

Updated on: Sep 04, 2023 | 11:44 PM

సోమవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో 3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్ నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే 3 పాయింట్లతో సూపర్-4కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ ఓడిన నేపాల్‌ టీం ఆసియాకప్ నుంచి తప్పుకుంది. ఈ విజయంతో 2023 ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4 రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇక సూపర్ 4 రౌండ్‌లో భారత జట్టు సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో తలపడనుంది.

క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. వర్షం వచ్చేసరికి భారత్ 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ఇటువంటి పరిస్థితిలో, అంపైర్లు DLS పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు అందించారు. ఈ టార్గెట్‌ను రోహిత్-గిల్ జోడీ 20.1 ఓవర్లలో సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 74 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇవి కూడా చదవండి

రోహిత్-గిల్ సెంచరీ భాగస్వామ్యం..

231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రోహిత్-గిల్ జోడీ భారత్‌కు నిలకడగా శుభారంభం అందించింది. వర్షం వచ్చేసరికి ఇద్దరూ 17 పరుగులు జోడించారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పుడు, భారత బ్యాట్స్‌మెన్ ఇద్దరూ లయలో కనిపించారు. రోహిత్-గిల్ ఇద్దరూ అద్భుతమైన షార్ట్‌లు సాధించారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

పవర్‌ప్లే-1: భారత్ స్కోరు 5 ఓవర్లలో 31 పరుగులు..

వర్షం తర్వాత, ఆట తిరిగి ప్రారంభం కాగా, భారత్‌కు 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. మొదటి పవర్‌ప్లే 5 ఓవర్లు కొనసాగింది. ఇందులో భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది.

100 పరుగుల భాగస్వామ్యం..

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..