IND vs PAK: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కాక ముందే టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ జట్టులోని ప్రధాన వికెట్ కీపర్, ఇంకా మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అయితే 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో రాహుల్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ ఈ యువ ప్లేయర్ ఓపెనర్. ఇదే ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా మారి రోహిత్ శర్మకు జోడి అయితే.. శుభమాన్ గిల్ మూడో స్థానంలోకి, అలాగే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది.
శుభమాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగితే టీమిండియా కోహ్లీ పరుగులను మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా కలిగినప్పటికీ.. మూడో స్థానంలో బరిలోకి దిగితే ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే మూడో స్థానంలో గిల్ కంటే కోహ్లీ బెస్ట్ ఆప్షన్, కానీ కేఎల్ రాహుల్ గాయం కారణంగా భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులు చేయాల్సి వస్తోంది. ఇవేం కాకుండా కోహ్లీ మూడో స్థానంలో, గిల్ నాలుగో స్థానంలో ఆడితే ఎలాంటి నష్టం జరగకపోవచ్చు.
రాహుల్ దూరం..
UPDATE
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia
— BCCI (@BCCI) August 29, 2023
ఇదిలా ఉండగా.. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ సమయంలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేసేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉన్నా, ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 – By @RajalArora #TeamIndia | @VVSLaxman281
Full interview 🎥🔽
— BCCI (@BCCI) August 27, 2023
రేపే ప్రారంభం..
Just 1 day left until the thrill and excitement of Super11 Asia Cup 2023 unfold! Are you ready for the action-packed ride?
🎟️ Get your tickets NOW: https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 pic.twitter.com/2DxB5V95zQ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 29, 2023
కాగా, ఆసియా కప్ రేపటి నుంచి ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 4న నేపాల్‌తో ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 27న జరగనుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్దీష్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్ ప్లేయర్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..