SL vs AFG, Asia Cup 2022: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్ శ్రీలంకకు ఝలక్ ఇచ్చింది ఆఫ్గనిస్థాన్. 9 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో లంకేయులను చిత్తు చేసి టోర్నీలో శుభారంభం అందుకుంది. తద్వారా టోర్నీలోని ఇతర జట్లకు చిన్నపాటి హెచ్చరికలు జారీ చేసింది. టోర్నమెంట్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో శనివారం దుబాయ్ స్టేడియంలో ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ఆఫ్గన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదని భావిస్తూ ఆ జట్టు బౌలర్లు చెలరేగారు. శ్రీలంక బ్యాటింగ్‌ను తత్తునీయులు చేశారు. 19.4 ఓవర్లల కేవలం 105 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఆఫ్గన్ అదరగొట్టింది. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫజల్హక్ ఫారూఖీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్గన్ బౌలర్ల ధాటికి కేవలం 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది లంక. అయితే దనుష్క గుంటిలక, భానుక రాజపక్స జోడీ ఆ జట్టును ఆదుకున్నారు. తర్వాతి 5 ఓవర్లలో ఇద్దరూ 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును 49 పరుగులకు చేర్చారు. అయితే ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ మరోసారి కుదుపునకు గురైంది. 13వ ఓవర్లు ముగిసే సరికే 69 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో చామిక కరుణరత్నే కొన్ని షాట్లతో స్కోరును 100 పరుగులు దాటించాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు.
? RESULT | AfghanAtalan WIN BY 8 WICKETS@RGurbaz_21 (40) and @zazai_3 (37*) followed their incredible bowling effort with an electrifying batting display as they chased down the 106-run target with 9.5 overs to spare.
Congratulations to everyone!#AfghanAtalan | #AsiaCup2022 pic.twitter.com/YAKL18G1z4
— Afghanistan Cricket Board (@ACBofficials) August 27, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..