భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్ట్ మ్యాచ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అసలు ప్రణాళిక ప్రకారం, ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగిన 100వ టెస్ట్ మ్యాచ్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల తన రిటైర్మెంట్‌ను కొంతకాలం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హాజరు కావాలని కోరాడు, కానీ ఆ అవకాశం దక్కలేదు. అశ్విన్ 100వ టెస్ట్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక వేడుకను నిర్వహించింది. అతనికి ఒక జ్ఞాపికను అందజేశారు. అయితే, ఆ జ్ఞాపికను ధోనీ చేతుల మీదుగా అందుకోవాలని అశ్విన్ ఆశించాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ధోనీ హాజరు కాలేకపోయాడు. దీనివల్ల కొంత నిరాశకు గురైనా, అశ్విన్ తరువాత ఒక మధురమైన విషయాన్ని పంచుకున్నాడు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడుతూ, ధోనీ నుండి తనకు అనుకోని బహుమతి లభించిందని తెలిపాడు. అది మరోకటి కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తనను తిరిగి కొనుగోలు చేయడం.
“ధర్మశాలలో నా 100వ టెస్ట్ కోసం నేను ఎంఎస్ ధోనిని పిలిచాను. అయితే, అతను రాలేకపోయాడు. కానీ, అతను నన్ను తిరిగి CSK జట్టులోకి తీసుకున్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. ఎంఎస్, దీన్ని చేసినందుకు ధన్యవాదాలు. నేను ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది” అని అశ్విన్ చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చెప్పాడు.
2008లో CSKతో తన IPL ప్రయాణాన్ని ప్రారంభించిన అశ్విన్, 2015 తర్వాత జట్టు నుంచి విడిపోయాడు. అప్పటి నుంచి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, 2025 IPL వేలంలో అతను CSKలో తిరిగి చేరడం అభిమానులకు ముచ్చటైన వార్తగా మారింది.
అశ్విన్ తన అనుభవాన్ని తెలియజేస్తూ – “నేను CSKకి తిరిగి రావడం ఒక పూర్తయిన ప్రయాణం లాంటిది. గతంలో ఇక్కడ ఎక్కువ విజయాలు సాధించాను. కానీ ఇప్పుడు, విజయాల కోసం కాకుండా, మళ్లీ CSK కుటుంబంలో చేరి ఆనందంగా ఉండటానికి వచ్చాను. ఇది ఉండటానికి అద్భుతమైన ప్రదేశం” అని పేర్కొన్నాడు.
అశ్విన్ 2025 IPLలో CSK తరఫున మళ్లీ ఆడబోతుండటంతో ధోనీ, అశ్విన్ కలయికను అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. CSKలోకి తిరిగి రావడం అశ్విన్‌కు వ్యక్తిగతంగా చాలా సంతోషకరం. అతని కెరీర్‌లో ఇది మరో కొత్త అధ్యాయంగా మారింది.
"I called Dhoni for my 100th Test. I invited him to hand over memento in Dharamshala. I wanted to make that my last Test, but he couldn’t make it. What I didn’t expect was that he would give me an even better gift — bringing me back to CSK.” – Ash anna 💛 pic.twitter.com/25f8q7mkMY
— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) March 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..