Harry Brook Catch: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2023 యాషెస్ మూడో టెస్టు హెడింగ్లీలో జరుగుతోంది. 3 రోజులు పూర్తి చేసుకున్న ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఇంగ్లండ్ పైచేయి భారీగా కనిపిస్తోంది. అయితే మూడోరోజు ఆటలో హ్యారీ బ్రూక్ రన్నింగ్ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెట్టింట్లో దూసుకపోతోంది. బ్రూక్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ అందించాడు.
బ్రూక్ క్యాచ్ పట్టిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. వీడియోను షేర్ చేస్తూ, “ఎప్పుడూ సందేహించవద్దు” అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆస్ట్రేలియా తరపున ఇంగ్లిష్ బౌలర్ మార్క్ వుడ్ బౌలింగ్ చేయగా, మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ చేస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. స్టార్క్ వుడ్ వేగవంతమైన పేస్, బౌన్సీ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు.
Never in doubt 😉 #EnglandCricket | #Ashes pic.twitter.com/8FapL3CV4u
— England Cricket (@englandcricket) July 8, 2023
కానీ, బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాలిలో లేచింది. బంతి గాలిలోకి వెళ్లడం చూసి, వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో, షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ క్యాచ్ కోసం పరుగెత్తారు. ఇద్దరి మధ్య క్యాచ్ తీసుకోవడంపై గందరగోళం నెలకొంది. ఇద్దరు ఆటగాళ్లలో బెయిర్ స్టో ఆడిపోగా.. హ్యారీ బ్రూక్ క్యాచ్ కోసం లాంగ్ రన్ చేశాడు. డైవింగ్ చేస్తూ అద్భుత క్యాచ్ తీసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..