Asia Cup 2022: భారత జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)పై నెట్టింట ట్రోలింగ్ సాగుతోంది. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో ఓ క్యాచ్‌ను నేలపాలు చేసినందుకు గానూ కొందరు నెటిజన్లు అతనిని తిట్టిపోస్తున్నారు. కొందరైతే ఏకంగా అతనిని ఖలీస్తానీ అంటూ వికిపిడియా ప్రొఫైల్ పేజీనే ఎడింట్ చేశారు. ఈనేపథ్యంలో అర్ష్‌దీప్‌పై వస్తోన్న విమర్శలపై అతని తండ్రి దర్శన్ సింగ్ స్పందించాడు. టీమిండియా గెలవాలని అభిమానులు కోరుకున్నారని, అది జరగనప్పుడు వారు నిరాశకు గురవడం సహజమేనంటూ తన కొడుకుపై వస్తున్న విమర్శలను సానుకూలంగా తీసుకున్నారాయన.
తప్పును సరిదిద్దుకున్నా..
ప్రతి ఒక్కరూ తమ జట్టు గెలవాలని కోరుకుంటారు. ఇది జరగనప్పుడు, అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆటగాళ్లపై చూపిస్తారు. నా కుమారుడి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే మేం ఈ ట్రోల్స్‌ను సానుకూలంగా తీసుకుంటున్నాం. మ్యాచ్ మాత్రం అద్భుతంగా సాగింది. నేను నా కుమారుడితో మాట్లాడాను. నెట్టింట్లో జరుగుతోన్న ట్రోల్స్ గురించి తను ఆలోచించడం లేదన్నాడు. తన దృష్టంతా శ్రీలంకతో మ్యాచ్‌పైనే ఉందన్నాడు. ఆటగాళ్లపై ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. ఒత్తిడి సమయాల్లో క్యాచ్‌లను వదిలేయడం పరిపాటే. అయితే నాకుమారుడు తర్వాతి ఓవర్లోనే తన తప్పును సరిదిద్దుకున్నాడు. అయితే చివరి ఓవర్ లో పరుగులు నియంత్రించడంలో విఫలమై ఉండొచ్చు. కానీ అభిమానులు అర్థం చేసుకోవాలి. భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో మరోసారి తలపడుతాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆసియా ఛాంపియన్‌గా నిలుస్తుంది. అభిమానులు భారత జట్టుకు మద్దతు ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చారు దర్శన్ సింగ్.
కాగా సూపర్-4 రౌండ్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్లు తలపడున్నాయి. టోర్నీలో నిలవాంటే టీమిండియాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..