Arshdeep Singh Breaks Stumps: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ విజయానికి బిగ్గెస్ట్ హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డెడ్లీ బౌలింగ్‌తో అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ తన ఫాస్టెస్ట్ బంతులతో వరుసగా రెండు బంతుల్లో రెండుసార్లు స్టంప్‌లను విడగొట్టాడు. అయితే ఈ స్టంప్స్ (LED Stumps) రేటు తెలిస్తే.. నిజంగా షాక్ అవ్వాల్సిందే. అయితే, అర్షదీప్ రూపంలో బీసీసీఐకి సరికొత్త టెన్షన్‌తోపాటు.. లక్షల్లో నష్టం వాటిల్లింది.
ఈ మ్యాచ్‌లో, అర్ష్‌దీప్ సింగ్ రెండు వరుస బంతుల్లో రెండుసార్లు స్టంప్‌ను విడగొట్టాడు. దీంతో బీసీసీఐకి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షలో కాదు.. ఏకంగా రూ.80లక్షల నష్టాన్ని కలిగించాడు. ఎల్‌ఈడీ స్టంప్‌లు, వికెట్ సెట్ ధర దాదాపు రూ.35 నుంచి 40 లక్షలు ఉంటుంది.
ఈ ఎల్‌ఈడీ స్టంప్‌లను తొలిసారిగా 2013 ప్రపంచకప్ సమయంలో ఐసీసీ ఆమోదించింది. అంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో వీటిని ఉపయోగించారు. ఇది బిగ్ బాష్ లీగ్‌లో విజయం సాధించిన తర్వాత 2013లో మొదటిసారి ఉపయోగించారు. అంపైరింగ్‌లో కీలకంగా ఉపయోగపడే ఈ సాంకేతికత కారణంగా, ఈ స్టంప్‌లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టంప్‌లుగా మారాయి. ప్రస్తుతం వన్డేలు, టీ20లలో ఈ LED స్టంప్‌లను ఉపయోగిస్తున్నారు.
Stump breaker,
Game changer!Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls ?#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
— JioCinema (@JioCinema) April 22, 2023
ముంబై ఇండియన్స్‌పై అర్ష్‌దీప్ సింగ్ డేంజరస్ బౌలింగ్‌తో భయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ ముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..