Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడి ఇంట పెళ్లి బాజాలు..అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్

Arjun Tendulkar Wedding : క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. అర్జున్, సానియా చందోక్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడి ఇంట పెళ్లి బాజాలు..అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్
Arjun Tendulkar (1)

Updated on: Jan 07, 2026 | 5:16 PM

Arjun Tendulkar Wedding : క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. అర్జున్, సానియా చందోక్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఆగస్టు 2025లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వీరి వివాహం మార్చి 5, 2026న ముంబైలో ఘనంగా జరగనుంది. పెళ్లికి సంబంధించిన వేడుకలు మార్చి 3వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని టెండూల్కర్ కుటుంబం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అర్జున్ టెండూల్కర్ చేసుకోబోయే సానియా చందోక్ ఒక విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్ . ఆమె ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. సానియా ఒక ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. ఆమె కుటుంబం చాలా కాలంగా టెండూల్కర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. అర్జున్, సానియా చిన్నప్పటి నుంచే స్నేహితులు కావడం విశేషం. ఇప్పుడు ఆ స్నేహం కాస్తా వివాహ బంధంగా మారుతోంది.

అర్జున్ టెండూల్కర్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ ఒకేసారి కొత్త మలుపులు తీసుకోబోతున్నాడు. మార్చిలో పెళ్లి చేసుకున్న వెంటనే, ఆయన ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధం కావలసి ఉంటుంది. అర్జున్ టెండూల్కర్ ఈసారి కొత్త జట్టుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి ఆయన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి ట్రేడ్ అయ్యారు. పెళ్లి తర్వాత భార్య సానియా ఇచ్చే మద్దతుతో ఐపీఎల్ మైదానంలో కూడా అర్జున్ మెరుపులు మెరిపిస్తాడేమో చూడాలి.

లెఫ్ట్ హ్యండ్ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టు తరపున ఆడుతున్నాడు. ముంబై తరపున కెరీర్ ప్రారంభించినప్పటికీ, మెరుగైన అవకాశాల కోసం ఆయన గోవాకు మారారు. ఇప్పటివరకు 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్, ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. గతేడాది మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోయినప్పటికీ, లక్నో జట్టులో ఆయన కీలకంగా మారే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి