అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేశాడుగా.!

|

Feb 15, 2021 | 8:04 PM

Arjun Tendulkar Allround Show: టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాజాగా జరిగిన...

అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేశాడుగా.!
Follow us on

Arjun Tendulkar Allround Show: టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ రాణించి తన అద్భుత ప్రతిభను చాటి చెప్పాడు. ముఖ్యంగా అర్జున్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి.. కొంచెంలో యువరాజ్ సింగ్ రికార్డును మిస్ చేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ స్థానికంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో అర్జున్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించడం విశేషం.

ఇటీవల ఎంఐజీ క్రికెట్‌ క్లబ్‌- ఇస్లాం జింఖానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంఐజీ తరపున అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అర్జున్ తన అద్భుతమైన ఆల్‌రౌండ్ షోతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐజీ క్రికెట్‌ క్లబ్‌ 45 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 385 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రగ్నేశ్‌ కందీలెవార్‌ సెంచరీ చేయగా.. మరో ఆటగాడు కెవిన్(96) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక అర్జున్ టెండూల్కర్ అయితే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 77 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్‌ హషీర్‌ దఫేదార్‌ వేసిన ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింఖానా జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రత్యర్ధి జట్టు పతనాన్ని అర్జున్ టెండూల్కర్, జైస్వాల్‌. శ్రేయస్‌ గౌరవ్‌లు మూడేసి వికెట్లతో శాసించారు. కాగా ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ తన పేరును రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరకు అతడు తన పేరును నమోదు చేసుకున్నాడు.