దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఆంధ్రా అమ్మాయి ఎండీ షబ్నమ్ సత్తాచాటింది. మూడు వికెట్ల పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ షఫాలీ వర్మ (0) పేలవమైన ఫామ్ కొనసాగించింది. అయితే శ్వేత (39 బంతుల్లో 40; 5 ఫోర్లు), సౌమ్య (46 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (15) ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో హ్లుబి, కేలా రేనకె చెరో 2 వికెట్లు తీశారు. కాగా తక్కువ టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలను భారత బౌలర్లు కట్టడి చేశారు. పరుగులు నియంత్రించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది.
కాగా ఈ మ్యాచ్‌లో విశాఖపట్నానికి చెందిన సీమర్ ఎండీ షబ్నమ్ చెలరేగింది. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చిన ఆమె మూడు వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. ఆమెకు తోడు అర్చనా దేవి (3/14) కూడా చెలరేగడంతో టీమిండియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ సిరీస్ తర్వాత జనవరి 14 నుంచి 29 వరకు తొలి సారి అండర్–19 మహిళల టి20 దక్షిణాఫ్రికాలోనే జరగనుంది. ఈ ప్రతిష్ఠా్త్మక టోర్నీకి సన్నాహకాల్లోనే భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
#TeamIndia clinch a comprehensive 5️⃣4️⃣-run win against SA U19 Women at the Steyn City Ground & take a 1️⃣-0️⃣ lead in the 5️⃣-match #SAvIND T20I series ????
4️⃣0️⃣ runs each with the bat from Shweta Sehrawat & Soumya Tiwari ??
3️⃣ wickets apiece for Shabnam Shakil & Archana Devi ?? pic.twitter.com/5cjRF5TzPP
— BCCI Women (@BCCIWomen) December 27, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..