Video: ఆర్సీబీని మళ్లీ ఎగతాళి చేసిన రాయుడు! ఐపీఎల్‌లో ఇలాంటి ఓ టీమ్‌ ఉండాలంటూ..

ఐపీఎల్ 2025లో RCB, CSK మధ్య మ్యాచ్‌కు ముందు, మాజీ CSK ఆటగాళ్ళు అంబటి రాయుడు, ఎస్ బద్రీనాథ్ RCBపై జోకులు వేశారు. రాయుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. RCB ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నానని, కానీ ఈ ఏడాది కాదని రాయుడు అన్నారు.

Video: ఆర్సీబీని మళ్లీ ఎగతాళి చేసిన రాయుడు! ఐపీఎల్‌లో ఇలాంటి ఓ టీమ్‌ ఉండాలంటూ..
Virat Kohli Ambati Rayudu

Updated on: Mar 28, 2025 | 4:50 PM

ఐపీఎల్‌ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, ఎస్ బద్రీనాథ్ ఆర్సీబీపై జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. ట్రోఫీ గెలవాలనే ఆర్సీబీ కల ఈ సారైన తీరుతుందా అని బద్రీనాథ్‌ అడిగితే.. రాయులు వెకిలి నవ్వులు నవ్వుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఇద్దరు సీఎస్‌కే మాజీ ఆటగాళ్ళు ఆర్సీబీ ట్రోఫీని గెలవడంలో కోసం చేసే పోరాటంపై చర్చించుకున్నారు. ట్రోఫీ గెలవడానికి ఆర్సీబీ చేసే పోరాడటం చూడటం నాకు ఎప్పుడూ ఇష్టం అని రాయుడు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఆర్సీబీ ఏదో ఒక రోజు ట్రోఫీ గెలవాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఈ సంవత్సరం కాదు! నిజానికి, ఐపీఎల్ కు నిరంతరం అంచనాలను పెంచే ఇలాంటి ఓ టీమ్‌ అవసరం. ఇది టోర్నమెంట్‌ను మరింత సరదాగా మారుస్తుంది అంటూ కాస్త అతి వ్యాఖ్యలే చేశాడు.

ఈ వీడియో చూసిన ఆర్సీబీ అభిమానులు రాయుడిపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే.. ఆర్సీబీ ఐపీఎల్‌లో కప్పు కొట్టకపోయినా.. ఒక ఎంటటైనింగ్‌ టీమ్‌గా, జోకర్‌ టీమ్‌లా ఉండానే ఉద్దేశంతో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు రాయుడిపై మండిపడుతున్నారు. ఈ సారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మంచి ప్రదర్శన చేసి కప్పు గెలవాలని కూడా రాయుడు కోరుకున్నాడు. ఆర్సీబీతో పాటు, విరాట్‌ కోహ్లీపై కూడా గతంలో రాయుడు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.