ఆసియా కప్‌లో గాయపడి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. మోకాలికి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన రికవరీ అప్‌డేట్స్‌ను పంచుకుంటోన్న జడేజా తాజాగా తన ట్రైనింగ్‌ని ప్రారంభించాడు.ఈ మేరకు ఓ వీడియోని కూడా రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో జడ్డూ జిమ్‌లో అటు ఇటూ పరిగెడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కాగా ఇప్పటికీ బెంగళూరు ఎన్‌సీఏలోనే ఉన్న జడేజా.. ఇంకా పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోలేదు. కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో త్వరగా రికవరీ అవుతున్నాడని భావించవచ్చు. కాగా ఒకవేళ జడేజా ఫిట్‌నెస్ సాధించినా ఇప్పట్లో అతను టీమిండియాతో కలవడం సాధ్యం కాదని తెలుస్తోంది. మరోవైపు జడేజా స్థానంలో జట్టులో కొచ్చిన అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతితో మాయ చేస్తూనే అవసరమైనప్పుడు బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ నిలిచాడు.
కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అక్టోబర్ 23న పాక్‌తో తలపడనుంది. ఇక ఆసీస్‌తో జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. అయితే బుధవారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇక నేరుగా పాక్‌తోనే అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. కాగా వరల్డ్‌కప్‌కు జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమయ్యాడు. దీంతో భారత్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారిందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. అతనికి తోడు భువీ, అర్ష్‌దీప్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తేనే టీమిండియాకు ప్రపంచకప్ గెలవగలదని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
??♂️??♂️??♂️ pic.twitter.com/GhHGW5xaV4
— Ravindrasinh jadeja (@imjadeja) October 19, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..