
Akash Deep : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో భారత బౌలర్ ఆకాష్ దీప్, ఇంగ్లాండ్ బౌలర్ బ్రిడాన్ కార్సే మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆకాష్ దీప్ బంతిని ముందుకు ఆపిన తర్వాత, కార్సే విసిరేందుకు ప్రయత్నించగా ఆకాష్ దీప్ నువ్వు బాల్ వేయ్ అన్నట్లు రెచ్చగొట్టాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో జరిగింది. అంతకుముందు కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ వికెట్లు తీసి కార్సే మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో, బెన్ స్టోక్స్ అతని జట్టు కూడా దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు కనిపించింది.
కార్సే బంతిని ఆకాష్ దీప్ వైపు విసిరేందుకు ప్రయత్నించాడు. దీనిపై ఆకాష్ దీప్ కోపంగా.. దమ్ముంటే బాల్ వేయ్..అంటూ ఇంగ్లాండ్ ఆటగాడిని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్ వికెట్లు కోల్పోయి 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట చివరి బంతికి బెన్ స్టోక్స్, ఆకాష్ దీప్ వికెట్ తీసి భారత జట్టుకు మరో షాక్ ఇచ్చాడు.
PEAK TEST CRICKET🔥#AkashDeep isn’t taking it from anyone and this is why we pay our internet bills.#ENGvIND 👉 3rd TEST, DAY 5, MON, 14 JUL, 2:30 PM, on JioHotstar pic.twitter.com/J6biA573VN
— Star Sports (@StarSportsIndia) July 13, 2025
ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తో కలిసి చివరి రోజు విజయం కోసం పోరాడాలి. మొదటి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 192 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..