
ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఓపెనర్‌గా బరిలోకి దిగిన అజింక్య రహానే మొదటి ఓవర్ నుంచే తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్లను సైతం లెక్కచేయకుండా మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. వార్త రాసే సమయానికి రహానే 67 పరుగులు చేశాడు. కేవలం 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ లతో యంగ్ ప్లేయర్ కు ఏమాత్రం తగ్గేదేలే అంటూ బౌలర్లను చీల్చి చెండాడాడు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఏఎం ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..