Video: కోల్‌కతాపై ‘హిట్‌మ్యాన్’ హవా.. ఐపీఎల్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్.. అదేంటంటే?
Rohit Sharma Most runs against KKR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం పది పరుగులు పూర్తి చేయడం ద్వారా, లీగ్ చరిత్రలోనే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు. తద్వారా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును ఆయన తుడిచిపెట్టారు.

Rohit Sharma Most runs against KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ అంటే రోహిత్ శర్మకు ప్రత్యేకమైన అభిమానం. ఆ జట్టుపై పరుగులు సాధించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. తాజా మ్యాచ్‌కు ముందు రోహిత్ ఖాతాలో కోల్‌కతాపై 1083 పరుగులు ఉన్నాయి. వార్నర్ రికార్డును బద్దలు కొట్టడానికి ఆయనకు కేవలం 11 పరుగులు అవసరమయ్యాయి. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో రోహిత్ ఆ మైలురాయిని చేరుకుని, ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై అత్యధిక పరుగులు (1094+) చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచారు. డేవిడ్ వార్నర్ (1093 పరుగులు) ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయారు.
కోల్‌కతాపై అద్భుతమైన గణాంకాలు..
నైట్ రైడర్స్‌తో ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ సగటు 38గా ఉండటం విశేషం. ఈ జట్టుపై ఆయన ఒక అద్భుతమైన శతకంతో పాటు ఆరు అర్ధ శతకాలు బాదారు. 127 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తూ కోల్‌కతా బౌలర్లకు ఎప్పుడూ సవాలు విసురుతుంటారు. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు కాగా, మిగిలిన ఇద్దరు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ.
అగ్రస్థానంలో నిలిచిన భారత వీరుడు..
కోల్‌కతాపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ (1021), శిఖర్ ధావన్ (907), సురేష్ రైనా (829) ఉన్నారు. ఈ రికార్డు రోహిత్ శర్మలోని నిలకడను, ముఖ్యంగా కోల్‌కతా జట్టుపై ఆయనకున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ అద్భుత ప్రదర్శనతో సామాజిక మాధ్యమాల్లో రోహిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్ విజయోత్సాహం..
@ImRo45 On fire 🔥🔥🔥🔥
Pull Shot 💥💥💥💥💥💥💥💥#MIVSKKR #RohitSharma pic.twitter.com/OSHnf2JEqA
— 李小龙 × 成龙 ⚡ | Global Trends (@SrinivasJi55112) March 29, 2026
ఈ వ్యక్తిగత రికార్డుతో పాటు, ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఈ సీజన్‌లో మంచి ఊపు మీద కనిపిస్తోంది. రోహిత్ అందించిన ఈ శుభారంభం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా వాంఖడే స్టేడియం లేదా ఈడెన్ గార్డెన్స్.. వేదిక ఏదైనా కోల్‌కతాపై రోహిత్ బ్యాట్ ఝుళిపించడం ఖాయమని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
