4 బంతుల్లో 4 వికెట్లు.. టీమిండియాను ఓడించినోడు.. మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేశాడు.! ఎవరంటే.?

టీమిండియాను ఓడించినోడు.. ఏకంగా ఓ మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేశాడు. చివరి ఓవర్ 4 బంతుల్లో 4 వికెట్లు తీసి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇంతకీ అతడెవరో తెలుసా.?

4 బంతుల్లో 4 వికెట్లు.. టీమిండియాను ఓడించినోడు.. మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేశాడు.! ఎవరంటే.?
New Zealand

Updated on: Jan 10, 2024 | 2:08 PM

టీమిండియాను ఓడించినోడు.. ఏకంగా ఓ మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేశాడు. చివరి ఓవర్ 4 బంతుల్లో 4 వికెట్లు తీసి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇంతకీ అతడెవరో తెలుసా.? ఆ ప్లేయర్ మీకు గుర్తున్నాడా.? గతంలో ఇండియా పిచ్‌పై ఏకంగా 10 వికెట్లు తీసి.. టెస్టు మ్యాచ్ ‌గెలిపించాడు. అతడు మరెవరో కాదు అజాజ్ పటేల్.

న్యూజిలాండ్‌లో జరుగుతోన్న సూపర్ స్మాష్ 2024లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ వర్సుఅగా రెండో విజయాన్ని అందుకుంది. ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ 63 బంతుల్లో భారీ సెంచరీ చేయగా.. వికెట్ కీపర్ క్లీవర్ హాఫ్ సెంచరీతో అతడికి సహాయాన్ని అందించాడు. వీరిద్దరి కారణంగా జట్టు భారీ స్కోర్ సాధించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఒటాగో జట్టు.. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లు అజాజ్ పటేల్, బెవాన్ స్మాల్ ముప్పుతిప్పలు పెట్టారు. మొదటి మూడు కీలక వికెట్లు రైట్ ఆర్మ్ మీడియం పేసర్ స్మాల్ తీయగా.. చివరి ఓవర్‌లో నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసిన అజాజ్ పటేల్.. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు భారీ విజయాన్ని అందించాడు.