MS Dhoni: క్యాండీ‌క్రష్ ఆడుతున్న ధోనికి ఎయిర్ హోస్టెస్ గిఫ్ట్.. మహీ స్పందన ఏమిటంటే..? వైరల్ అవుతున్న వీడియో..

|

Jun 25, 2023 | 5:06 PM

MS Dhoni: భారత జట్టుకి 3 ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్‌కి 5 టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మహీ కనిపించాడంటే తమ రోజు గడిచిపోయినట్లే అని భావించే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా..

MS Dhoni: క్యాండీ‌క్రష్ ఆడుతున్న ధోనికి ఎయిర్ హోస్టెస్ గిఫ్ట్.. మహీ స్పందన ఏమిటంటే..? వైరల్ అవుతున్న వీడియో..
MS Dhoni Taking Chocolate
Follow us on

MS Dhoni: భారత జట్టుకి 3 ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్‌కి 5 టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మహీ కనిపించాడంటే తమ రోజు గడిచిపోయినట్లే అని భావించే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అదే తరహా అభిమానంతో ధోనికి చాక్లెట్‌ని ఇచ్చింది ఓ ఎయిర్ హోస్టెస్. తన ప్రయాణంలో భాగంగా క్యాండీక్రష్ ఆడుతున్న ధోనికి ఆ ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ ఇవ్వడానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక ఎయిర్ హోస్టెస్ కొన్ని చాక్లెట్లను ట్రేలో పెట్టుకుని నేరుగా ధోని దగ్గరకు వెళ్లి అతనికి ఆఫర్ చేస్తుంది. అందుకు ధోని చిరునవ్వుతో ఓ చాక్లెట్ తీసుకుని ఇది చాలు అన్నట్లుగా చెప్తాడు. ఆ వీడియోలో ధోని మాటలు వినపడకపోయినప్పటికీ ఏం జరిగిందో వివరంగా చూడవచ్చు.

అయితే ఆ వీడియో ఎప్పటిదో తెలియరాలేదు, కానీ జూన్ 25న LEO అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఇది షఏర్ అయింది. ఇక దీనిపై నెటిజన్లు, ధోని అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇప్పుడు క్యాండీక్రష్ డౌన్‌లోడ్ చేయాలనిపిస్తుంది’ అని, ‘ధోని దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయి’ అని, ‘క్యాండిక్రష్‌లో ధోని ఏ లెవెల్‌లో ఉన్నాడో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 85 వేలకు పైగా వీక్షణలు లభించాయి. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

మరోవైపు ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోని ముంబైలోని ఓ హాస్పిటల్‌లో మోకాలి సర్జరీ చేయించున్న సంగతి తెలిసిందే. సర్జరీ విజయవంతం కావడంతో రాంచీకి చేరకున్న ధోని ఇప్పుడు నిదానంగా కోలుకుంటున్నాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కొన్ని రోజుల  క్రితం చెప్పారు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తే.. లీగ్‌లో కనిపించాలని మహీ కోరుకుంటున్నాడని కూడా కాశీ తెలిపారు.

కాగా, ధోని సారథ్యంలోనే టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను గెలుచుకుంది. ధోని 2020లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ధోని కెప్టెన్సీలో భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో శిఖరాగ్రాలకు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని.. టీమిండియా తరఫున అత్యధిక టైటిల్స్‌ గెలిచిన సారథిగా చరిత్రలో నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇటీవలే 5వ ట్రోఫీని అందించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న టీమ్‌గా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును చెన్నై సూపర్ కింగ్స్‌ సమం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..