సచిన్ రికార్డు తెరమరుగు.. 27 ఏళ్లకు బ్రేక్!

|

Jul 06, 2019 | 5:03 AM

లీడ్స్‌: వరల్డ్‌కప్‌లో అఫ్గాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీ‌ఖిల్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. సుమారు 27 ఏళ్ళ క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును చెరిపేసి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ ఖిల్ పిన్న వయసులో 80కి పైగా పరుగులు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే 1992 వరల్డ్‌కప్‌లో సచిన్‌ నమోదు చేసిన రికార్డు తెరమరుగైంది. ‌1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 81 పరుగులు చేశాడు. […]

సచిన్ రికార్డు తెరమరుగు.. 27 ఏళ్లకు బ్రేక్!
Follow us on

లీడ్స్‌: వరల్డ్‌కప్‌లో అఫ్గాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీ‌ఖిల్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. సుమారు 27 ఏళ్ళ క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును చెరిపేసి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ ఖిల్ పిన్న వయసులో 80కి పైగా పరుగులు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే 1992 వరల్డ్‌కప్‌లో సచిన్‌ నమోదు చేసిన రికార్డు తెరమరుగైంది. ‌1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 81 పరుగులు చేశాడు.

సచిన్ 18 ఏళ్ళ 318 రోజుల వయసులో 80కి పైగా పరుగులు సాధించగా.. తాజాగా దాన్ని అలీ‌ఖిల్ బద్దలు కొట్టాడు. అలీ‌ఖిల్ 18 ఏళ్ళ 278 రోజుల వయసులో ఈ ఫీట్‌ను సాధించాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ‌ఖిల్ 86 పరుగులు సాధించాడు.