Cricket: 93 బంతుల్లో 163 పరుగులు.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో బౌలర్లపై వీరవిహారం.. గత్తర్ లేపిన్రు పో..

ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న టీ20 విటాలిటీ బ్లాస్ట్‌లో 38.5 ఓవర్లకు ఏకంగా 424 పరుగులు నమోదయ్యాయి. ఒక జట్టు నుంచి...

Cricket: 93 బంతుల్లో 163 పరుగులు.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో బౌలర్లపై వీరవిహారం.. గత్తర్ లేపిన్రు పో..
Cricket

Updated on: Jun 23, 2022 | 9:00 AM

సిక్స్.. సిక్స్.. సిక్స్.. ఫోర్.. ఫోర్.. ఫోర్.. టీ20 క్రికెట్ అంటేనే పరుగుల హోరు. ఎక్కువ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు విరుచుకుపడటం.. బౌలర్లు ప్రేక్షక పాత్రను పోషించడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇదే కోవలో ఓ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న టీ20 విటాలిటీ బ్లాస్ట్‌లో 38.5 ఓవర్లకు ఏకంగా 424 పరుగులు నమోదయ్యాయి. ఒక జట్టు నుంచి ఇద్దరు బ్యాటర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడితే.. మరో జట్టు నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. మరి అదేంటో చూసేద్దాం పదండి..

నిన్న నార్తాంప్టన్‌షైర్, వార్విక్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నార్తాంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఆ జట్టుకు వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సైఫ్ జాబ్ 32 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేయగా… ఓపెనర్ క్రిస్ లిన్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. వీరిద్దరే టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

7 బంతులు మిగిలి ఉండగానే వార్విక్‌షైర్ లక్ష్యచేధన…

212 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వార్విక్‌షైర్ జట్టుకు ఆదిలోనే అనుకోని దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ స్టిర్లింగ్(17), రాబర్ట్ యేట్స్(6), సామ్ హాయిన్(18) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీనితో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అయితే ఆ తర్వాత్ బ్యాటింగ్‌కు వచ్చిన ఆడమ్ హోస్(63), అలెక్స్ డేవిస్(42), క్రిస్ బెంజమిన్(58) చెలరేగి ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించడం కాదు.. 7 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు.. 11 సిక్సర్లు.. 11 ఫోర్లు..

వార్విక్‌షైర్ బ్యాటర్లలో అలెక్స్ డేవిస్ 233 స్ట్రైక్ రేట్‌తో 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. అలాగే క్రిస్ బెంజమిన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 58 పరుగులు చేయగా.. ఆడమ్ హోస్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 63 పరుగులు చేశాడు. మొత్తం మీద, ఈ ముగ్గురు బ్యాటర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌లతో 11 ఫోర్లు, 11 సిక్సర్లు బాదేశారు. దీనితో, ఈ మ్యాచ్‌లో వార్విక్‌షైర్ 6 వికెట్ల తేడాతో నార్తాంప్టన్‌షైర్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల వన్డేల్లో ఇంగ్లాండ్ క్రికెట్ తన సొంత రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి వన్డేలో 498 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది.