
Team India T20I World Cup 2026 Squad: భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నాహాలు ముమ్మరం చేసింది. టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, మేనేజ్‌మెంట్ ఇప్పటి నుంచే 15 మందితో కూడిన కోర్ టీమ్‌ను దాదాపు ఖరారు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ లిస్ట్‌లో పలువురు యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం దక్కగా, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపికైన ప్రస్తుత భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కనప్‌కు అత్యంత అనుకూలమైన కలయిక కావచ్చని భారత జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డారు.
కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ: టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ తన దూకుడుతో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. భవిష్యత్తు నాయకుడిగా గిల్‌ను తీర్చిదిద్దే ప్లాన్‌లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నివేదిక ప్రకారం, సంజూ శాంసన్, జితేష్ శర్మ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి అవకాశం దక్కింది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనుండగా, స్పిన్ మ్యాజిక్ కోసం వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశారు.
ఈ రిపోర్ట్ ప్రకారం, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను పక్కన పెట్టడం గమనార్హం. టీమ్ కాంబినేషన్, ఇటీవల ఫామ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే శ్రేయస్ అయ్యర్ పేరు కూడా ఈ జాబితాలో లేడు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా
శివమ్ దూబే
సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
వరుణ్ చక్రవర్తి
జస్ప్రీత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్
హర్షిత్ రాణా
వాషింగ్టన్ సుందర్.
గమనిక: ఇది అధికారిక ప్రకటన కాదు. మీడియా నివేదికలు, మాజీ కోచ్‌లు, విశ్లేషకుల అంచనాల ఆధారంగా రూపొందించిన సమాచారం. బీసీసీఐ నుంచి తుది జట్టు ప్రకటన రావాల్సి ఉంది.
#T20WorldCup squad ready for #TeamIndia? 👀💥#AbhishekNayar suggests that India’s prep to defend the crown has already begun, starting with the 5-match #INDvSA T20 series! 🇮🇳🏆#INDvSA 1st T20I 👉 TUE, 9th DEC, 6 PM! pic.twitter.com/8pclhooKfG
— Star Sports (@StarSportsIndia) December 4, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..