
Virat Kohli Sand Art Video: విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విరాట్ కోహ్లి క్రేజ్ మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ బొమ్మను ఇసుకపై అందంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించిన కళాకారుడు ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారంతే. ఒక పాకిస్తానీ అభిమాని ఇసుకపై తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశాడు.
విరాట్ కోహ్లీ ఫొటోను ఇసుకపై గీసిన ఆ కళాకారుడి పేరు సచన్. సచన్ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ నివాసి. అతను విరాట్ కోహ్లీకి వీరాభిమాని. బలూచిస్థాన్ నివాసికి విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. దీంతో ఇసుకపై కోహ్లీ ఫొటోను గీచి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
A beautiful sand art of Virat Kohli’s in Balochistan, Pakistan. [Sachaan Sand Art Gwadar]
King Kohli – Face of world cricket. pic.twitter.com/FpZFFk6IBY
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
Sand art of Virat Kohli in 2022 at Balochistan & Sand art of Virat Kohli in 2023 at Balochistan, Pakistan.
– Virat is the favourite for everyone. pic.twitter.com/ars1Zdu3P3
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
కాగా, శనివారం పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచాడు. కోహ్లీ కేవలం 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది విరాట్ కోహ్లీని బలిపశువుగా మార్చుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, వర్షం కారణంగా ఫలితం రాలేదు. ఇరు జట్లకు 1-1 పాయింట్లు ఇచ్చారు. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ని నేపాల్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 4న పల్లెకెలెలో భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది.
— Nishant 🇮🇳 (@Nishantchant) September 3, 2023
Deserves pic.twitter.com/FmCQcvwGgX
— Classic Mojito (@classic_mojito) September 3, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..