Team India : ఫస్ట్ టైం జట్టులోకి వచ్చారు.. వీరే ఈ సారి భారత్ ఆయుధాలు..వీళ్ల రికార్డులివే

2025 ఆసియా కప్ కోసం భారత టీ20 జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. జట్టులో యువ, సీనియర్ ఆటగాళ్లకు సమానంగా అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో ఈసారి ఏడుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది.

Team India : ఫస్ట్ టైం జట్టులోకి వచ్చారు.. వీరే ఈ సారి భారత్ ఆయుధాలు..వీళ్ల రికార్డులివే
Team India Asia Cup 2025 1

Updated on: Aug 20, 2025 | 1:53 PM

Team India : ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవుకు కెప్టెన్సీ, శుభమన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఈసారి జట్టులో యంగ్, సీనియర్ ఆటగాళ్ల మధ్య మంచి సమతుల్యత కనిపిస్తోంది. ముఖ్యంగా, తొలిసారిగా ఆసియా కప్ జట్టులో ఏకంగా ఏడుగురు యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 9 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ కొత్త ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. మొదటిసారిగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఏడుగురు ఆటగాళ్లు వీరే.. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్. ఈ ఆటగాళ్లు తొలిసారిగా ఆసియా కప్‌లో తమ టాలెంట్ చూపించుకోవడానికి రెడీ అయ్యారు.

గత కొంతకాలంగా టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఆడుతున్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సంజు శాంసన్ భారత జట్టు తరఫున 42 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 861 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు, అభిషేక్ శర్మ ఇప్పటివరకు 21 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు అతని బ్యాట్ నుండి వచ్చాయి. ఈసారి ఈ ఇద్దరి నుంచి మరింత మంచి ఓపెనింగ్ ఆశిస్తున్నారు.

వరుణ్ చక్రవర్తి 2021లో భారత టీ20 జట్టులో అరంగేట్రం చేశాడు. మొదటిలో అతను పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో జట్టు నుంచి తప్పించారు. కానీ, అతను ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు. చక్రవర్తి ఇప్పటివరకు భారత జట్టు తరఫున 18 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 33 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అతని స్పిన్ మాయాజాలం కీలకం కానుంది.

జితేశ్ శర్మను ఆసియా కప్ 2025 కోసం బ్యాకప్ వికెట్ కీపర్‌గా సెలక్ట్ చేశారు. శివమ్ దూబే, హర్షిత్ రాణా, రింకు సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా, రింకు సింగ్ లో ఆర్డర్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అతను ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. అందుకే హార్దిక్ పాండ్యాతో కలిసి ఫినిషింగ్‌లో రింకు కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..