AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 Ball 22 Runs: ఏం తాగి కొట్టావు బ్రో.. ఒక్క బంతికి 22 పరుగులు.. వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అరాచకం!

క్రికెట్‌లో ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతుంటాయి. ఒక్క బంతి మ్యాచ్‌ రూపాన్నే మార్చేస్తుంది. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆలాంటి ఆశ్చర్యఘటనే జరిగింది. సాధారణంగా ఒక బంతిలో మనం ఎన్ని రన్స్‌ తీయగలుగుతాం, రెండు, లేదా మూడు, కానీ ఈ లీగ్‌లో ఒక ఆటగాడు మాత్రం 22 పరుగులు సాధించాడు. ఇంతకు ఆ బ్యాటర్‌ ఎవరూ.. ఆ రన్స్‌ ఎలా సాధించాడో తెలుసుకుందాం పదండి.

1 Ball 22 Runs: ఏం తాగి కొట్టావు బ్రో.. ఒక్క బంతికి 22 పరుగులు.. వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అరాచకం!
22 Runs In One Ball
Anand T
|

Updated on: Aug 27, 2025 | 9:30 PM

Share

ఆర్సీబీ ప్లేయర్, వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన సత్తా చాడాడు. తన అద్భుత ప్రదర్శనతో యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతవరకు క్రికెట్‌ చరిత్రలో ఎవ్వరూ ఆడని షాట్స్‌ కొట్టాడు. సీపీఎల్ 2025లో మంగళవారం భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెజాన్‌ వారియర్స్‌ తరపున బరిలోకి దిగన రొమారియో షెఫర్డ్‌ ఒక బంతిలో ఏకండా 22 పరుగులు సాధించాడు. అది ఎగాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క బంతిలో 22 పరుగులు ఎలా వచ్చాయి!

  • మ్యాచ్‌లో 15వ ఓవర్‌ నడుస్తుంది. బౌలర్ అల్జారీ థామస్ బౌలింగ్ చేస్తున్నాయిడు.
  • అయితే ఓవర్‌లో థామస్‌ వేసిన మూడో బంతి నో-బాల్ అయ్యింది. దీనికి షెఫర్డ్‌ ఎలాంటి పరుగులు చేయలేదు.
  • తర్వాత ఫ్రీ-హిట్ వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత వేసిన బంతిని షెఫర్డ్ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే అది కూడా నోబాల్‌గా నిలిచింది.
  • ఆ తర్వాతి బంతిని వేసే ముందే థామస్ ఓవర్‌స్టెప్ వేసి వైడ్ బాల్ వేశాడు. దీంతో జట్టుకు మరొక పరుగు యాడ్‌ అయింది.
  • దీంతో ఆ తర్వాతి బంతినీ షెఫర్డ్‌ బౌండరీగా మలిచాడు. ఇక్కడ షెఫర్డును మరోసారి దురదృష్టం వెంటాడింది. ఎందుకంటే ఇది కూడా నో-బాల్‌గా అయ్యింది.
  • దీంతో మరో ఫ్రీ-హిట్ అవకాశం వచ్చింది. దీన్ని ఉపయోగించుకున్న షెపర్డ్‌ బంతిని సిక్స్‌గా మలిచాడు.
  • ఆ తర్వాత బంతిని కూడా షెఫర్డ్ స్టాండ్స్‌లోకి పంపించి వరుసగా మూడో సిక్స్‌ను కొట్టాడు.
  • మొత్తంగా బాల్స్, వైడ్, షెఫర్డ్ పవర్‌ హిట్టింగ్‌తో కలిపి, ఒకే ఒక్క లీగల్ డెలివరీకి మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఈ విధంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెఫర్డ్‌ కేవలం 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సిక్స్‌లు ఉండటం గమనార్హం.

వీడియో చూడండిం..

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.