Sourav Ganguly Birthday: సచిన్ నిర్ణయంపై గంగూలీ ఆగ్రహం.. కట్‌చేస్తే.. భార్యతోనూ మాట కలపని దాదా.. ఎందుకో తెలుసా?

Sourav Ganguly Wife Dona: సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి ప్రియురాలు డోనాను 1997లో వివాహం చేసుకున్నాడు. ఇరువురి కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించాయి. కానీ, గంగూలీ తిరుగుబాటు చేసి రహస్యంగా వివాహం చేసుకున్నాడు.

Sourav Ganguly Birthday: సచిన్ నిర్ణయంపై గంగూలీ ఆగ్రహం.. కట్‌చేస్తే.. భార్యతోనూ మాట కలపని దాదా.. ఎందుకో తెలుసా?
Sourav Ganguly Birthday

Updated on: Jul 08, 2023 | 7:09 AM

Sourav Ganguly Birthday: జులై 8న భారత క్రికెట్‌లోని గొప్ప కెప్టెన్‌లలో ఒకరైన సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. ఈరోజు 8 జులై 2023. గంగూలీకి నేటితో 51 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. గంగూలీ తన జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. మైదానంలోనూ, మైదానం వెలుపల కూడా ఎంతో విభిన్నంగా కనిపించాడు. అయితే, 16 సంవత్సరాల క్రితం గంగూలీ తన ప్రత్యేక స్నేహితుడు సచిన్ టెండూల్కర్ నిర్ణయం కారణంగా తన భార్య డోనాతో కూడా మాట్లాడలేకపోయాడు. ఈ ఆసక్తికర అంశం గురించి తెలుసుకుందాం..

1997 భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ వేగంగా అడుగులు వేస్తున్న సంవత్సరం. అదే సంవత్సరంలో అతను తన చిన్ననాటి ప్రేయసి డోనాను వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల అసంతృప్తి, తిరుగుబాటు మధ్య ఈ వివాహం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో వివాహం తర్వాత గంగూలీ వెంటనే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లవలసి వచ్చింది. అక్కడికి తన భార్యను కూడా తీసుకువెళ్లాడు.

సచిన్ నిర్ణయం..

ఈ వెస్టిండీస్ పర్యటనలో, గంగూలీ వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ, టెస్ట్ సిరీస్ అతనికి ఏమాత్రం మంచిది కాదు. గంగూలీ బ్యాటింగ్ చేసిన సమయంలో తన ప్రభావం చూపలేకపోయాడు. ఈసిరీస్ లో గంగూలీ 4 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్‌కు ముందు గంగూలీ ఆటతీరు బాగానే ఉంది. కానీ, వెస్టిండీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. సచిన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్న కాలం ఇది. గంగూలీ వరుసగా మూడు టెస్టుల్లో విఫలం కాగా, నాలుగో టెస్టులో అతని బ్యాటింగ్ రాలేదు. పేలవమైన ప్రదర్శన కారణంగా, సచిన్ అతనిని చివరి టెస్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇది గంగూలీకి మింగుడుపడలేదు.

గంగూలీ తన భార్యతో మాట్లాడటం మర్చిపోయాడు..

ఆ సమయానికి సౌరవ్, డోనాల వివాహం జరిగి కేవలం ఒక నెల మాత్రమే గడిచింది. ఇటువంటి పరిస్థితిలో, కుటుంబ సభ్యుల అసంతృప్తి, ఫీల్డ్‌లో పేలవమైన ప్రదర్శన, ఆపై జట్టుకు దూరంగా ఉండటం సౌరవ్‌ను ప్రభావితం చేసింది. టెస్టుకు ముందు సౌరవ్ తన భార్య డోనాను పంపేందుకు ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా టాక్సీలో మరో సహచరుడు కూడా ఉన్నాడు.

సచిన్ నిర్ణయంతో కలత చెందిన గంగూలీ..

అన్ని వైపుల నుంచి ఒత్తిడిగా ఫీలవ్వడంతో.. గంగూలీ తన భార్యతో మాట్లాడలేదు. సురక్షితంగా వెళ్లమని ఆమెకు సలహా కూడా ఇవ్వలేదు. ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడలేదు. జట్టు హోటల్ నుంచి విమానాశ్రయానికి చేరుకునే వరకు గంగూలీ తన తోటి ఆటగాళ్లతో మాత్రమే మాట్లాడుతూ.. సచిన్ నిర్ణయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గంగూలీకి ఈ అసంతృప్తి కారణంగా, డోనా కూడా ఏమీ మాట్లాడకపోవడమే మంచిదని భావించి, చివరకు ఏమీ మాట్లాడకుండా, సౌరవ్ తన భార్యను విమానాశ్రయంలో వదిలిపెట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..