టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్(25), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా(28) రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని సానియా మీర్జా కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్‌లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సానియా తెలిపింది. పారిస్‌లో బ్యాచులర్ పార్టీని పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే వీరిద్దరి వివాహం ఉండబోతుందని ఆమె పేర్కొంది.
కాగా అనమ్‌కు 2016లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన గతేడాది ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన ఫ్యాషన్ కెరీర్ మీదే దృష్టిపెట్టిన అనమ్ గత కొంతకాలంగా అసద్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఇదివరకు పలుమార్లు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. అలాగే అసద్ సైతం అనమ్‌తో తీసుకున్న ఓ ఫొటోకు ఫ్యామిలీ అనే కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే అసద్ ప్రస్తుతం బడ్డింగ్ లాయర్‌గా పనిచేస్తున్నాడు.