భారత మహిళ క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ విరుచుకుపడ్డారు. తన ట్విట్టర్ హాండిల్‌లో కామెంట్స్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌లో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. అయితే రజత పతకాన్ని తన దక్కించుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌పై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ ఇండియా బ్యాటింగ్ చెత్తగా ఉందంటూ ట్వీట్ చేశారు.
టీమిండియా ఓటమిపై అజారుద్దీన్ స్పందించారు. తన ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశాడు, “భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా ఉంది. కామన్ సెన్స్ లేదు. ప్రత్యర్థి జట్టు విజయానికి దారి చూపించారు.” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Rubbish batting by the Indian team. No common sense. Gave away a winning game on a platter. #INDvsAUS #WomensCricket #CWG22
— Mohammed Azharuddin (@azharflicks) August 7, 2022
ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టుకు శుభారంభం చేసింది. కేవలం 16 పరుగుల స్కోరు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. స్కోరు 22 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. అయితే ఆ తర్వాత మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అయితే ఆ తర్వాత టీమ్ ఇండియా పేకమేడలా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. కౌర్ 65 పరుగులను జోడించారు.
మరిన్ని కామన్వెల్త్ గేమ్స్ వార్తల కోసం..