CWG 2022: సత్తాచాటిన అన్షు మాలిక్‌.. రెజ్లింగ్‌లో సిల్వర్‌ మెడల్‌ కైవసం..

Commonwealth Games: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత యువ రెజ్లర్‌ అన్షు మాలిక్‌ సిల్వర్‌ పతకం సాధించారు. రెజ్లింగ్‌లో 57 కిలోల విభాగంలో పోటీ పడి రజత పథకాన్ని..

CWG 2022: సత్తాచాటిన అన్షు మాలిక్‌.. రెజ్లింగ్‌లో సిల్వర్‌ మెడల్‌ కైవసం..
Anshu Malik

Edited By:

Updated on: Aug 06, 2022 | 6:05 AM

Commonwealth Games: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత యువ రెజ్లర్‌ అన్షు మాలిక్‌ సిల్వర్‌ పతకం సాధించారు. రెజ్లింగ్‌లో 57 కిలోల విభాగంలో పోటీ పడి రజత పథకాన్ని దక్కించుకున్నారు. మహిళల ప్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో రెండు సార్లు బంగారు పథకాన్ని సాధించిన ఒడునాయో ఫోలసాడే అడెకురోయోతో అన్షు మాలిక్‌ పోటీ పడ్డారు. ఈ విభాగంలో అన్షు మాలిక్‌ ఓడి సిల్వర్‌ మోడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కామన్‌వెల్త్‌లో భారత్‌కు దక్కిన పతకాల సంఖ్య 22కు చేరింది.

 

ఇవి కూడా చదవండి


అయితే సెమీస్‌లో శ్రీలంకకు చెందిన నెత్మి పోరుతోటగేను ఓడించిన అన్షు చివరకు ఫైనల్‌కు చేరుకున్నారు. అన్షు మాలిక్‌ కామన్‌వెల్త్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి