Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటితో ముగియనున్నాయి. ఇందులో భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. భారత్ పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కాంస్య పతక పోరులో భారత జోడీ 2-0తో ఆస్ట్రేలియాకు చెందిన లోబ్బన్ డోనా, పీలే కామెరూన్‌లపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను 11-8తో పల్లికల్, రెండో గేమ్‌ను 11-4తో గెలుచుకున్నారు.
భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం
అదే సమయంలో అంతకుముందు హాకీలో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత మహిళల జట్టు 2-1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హాకీతో భారత్‌కు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. కాంస్య పతకాన్ని గెలుచుకున్న మా అసాధారణమైన మహిళల హాకీ జట్టు విజయానికి భారతీయులందరూ గర్వపడుతున్నారని అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల జట్టు చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి