మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకాన్ని అందించింది. ప్రియాంక 43:38.82లో రేసును పూర్తి చేసింది. ఈ విజయంతో ప్రియాంక గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి ఈమె నిలిచింది.
ప్రియాంక గోస్వామి కూడా టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆమె 17వ స్థానంలో నిలిచింది. కానీ, కామన్వెల్త్ క్రీడల్లో మాత్రం ఈమె అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.
ప్రియాంక గోస్వామి మొదట జిమ్నాస్ట్ కావాలని కోరుకుందంట. కానీ, ఆమె అథ్లెటిక్స్‌లో అందుకున్న బహుమతుల పట్ల ఆకర్షితులై ఈ క్రీడను ఎంచుకుంది. 2021 ఫిబ్రవరిలో ప్రియాంక రికార్డు టైమింగ్‌తో 20 కి.మీ రేసును గెలుచుకుంది.
ప్రియాంక గోస్వామి 1:28.45 రికార్డు టైమింగ్‌తో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఈ క్రీడాకారిణి అంతర్జాతీయ వేదికపై తొలిసారిగా పతకం సాధించింది.