సాహో సింధు.. ప్రపంచ ఛాంపియన్‌

|

Aug 25, 2019 | 6:47 PM

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌  షట్లర్ ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. ఫైనల్ ఫోబియాను చేధించి 2017 లో వరల్డ్ ఛాంఫియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 40 ఏళ్ల భారత కలను నెరవేర్చిన  తెలుగు తేజం విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు […]

సాహో సింధు.. ప్రపంచ ఛాంపియన్‌
Follow us on

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌  షట్లర్ ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. ఫైనల్ ఫోబియాను చేధించి 2017 లో వరల్డ్ ఛాంఫియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 40 ఏళ్ల భారత కలను నెరవేర్చిన  తెలుగు తేజం విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డ్ క్రియేట్ నెలకొల్పింది.

తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2వ పాయింట్‌ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. మధ్యలో ఒకుహర  రెండు పాయింట్లు సాధించినా సింధూ మళ్లీ జోరు కొనసాగించింది. విరామానికి 11-4తో అదరగొట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21-7తో విజేతగా నిలిచింది.