
కామన్వెల్త్ గేమ్స్‌లో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాలమీద పతకాలు పట్టుకొస్తున్నారు. తొలి రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న మన పతకాల పట్టిక.. ఇప్పుడు మోత మోగిస్తోంది. ముఖ్యంగా మహిళ బాక్సింగ్ విభాగంలో మన భారత వీర వరణితలు పవర్ ఫుల్ పంచ్‌లతో మెరుపులు మెరిపిస్తున్నారు. ఏకంగా ఒకే రోజులో మహిళా బాక్సింగ్ విభాగంలో 3 స్వర్ణ పథకాలను సాధించారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణాల సంఖ్య 11కి చేరుకుంది.
శనివారం మధ్యహ్నం మహిళా బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత యువ బాక్సింగ్ సంచలనం, క్రీడాకారిణి ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించగా.. కాసేపటికే 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా మరో బంగారు పథకాన్ని సాధించింది. అలాగే ప్రియా ఘంగాస్ మహిళల 60 కేజీల విభాగంలో కెనడాకు చెందిన మేరీ-బాతుల్ అల్-అహ్మదియాను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. అలాగే 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సైతం మరో స్వర్ణ పతకం గెలించింది,
గ్లాస్గోలో జరుగుతున్న ఈసారి కామన్వె్ల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు ఏడు 10 మెడల్స్ సాధించింది భారత్. వాటిలో బాక్సింగ్‌లో 4, జూడోలో 2, అథ్లెటిక్స్‌లో 2, వెయిట్‌లిఫ్టింగ్‌లో 1, పారా షాట్‌ఫుట్ విభాగంలో 1 బంగారు పతకం వచ్చింది. అంతేకాదు.. మన అథ్లెట్లు 13 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించారు. మొత్తం 27 పతకాల్లో మహిళలు సాధించినవి 12 దాకా ఉన్నాయి. అయితే పతకాల వేటలో అమ్మాయిలు, అబ్బాయిలు మీరా.. మేమా అన్నట్లు పోటీ పడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.