Bhavani Prasad Adapaka: తెలుగు యువకుల టాలెంట్ బౌండరీలు దాటుతోంది. తాజాగా హంగేరిలో సత్తా చాటుతున్నాడు తెలుగు తేజం. ఏకంగా అక్కడి జాతీయ క్రికెట్ జట్టును గెలిపించి తెలుగు వారి కీర్తిపతాకాన్ని ఎగురవేశాడు. ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన భవానీప్రసాద్ అడపాక ఉద్యోగరీత్యా హంగేరిలో నివాసం ఉంటున్నాడు. బుడాపెస్ట్‌లోని నోకియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భవానీ ప్రసాద్‌కు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఖాళీ సమయంలో క్రికెట్ ఆడేవాడు.
అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడతుండటంతో ఇటీవల ఏకంగా హంగేరి జాతీయ (Hungary Cricket) క్రికెట్ టీమ్‌కి ఎన్నికయ్యాడు భవానీప్రసాద్. తాజాగా హంగేరీ, బల్గేరియా జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్‌లో హంగేరీ టీమ్‌ని గెలిపించాడు భవానీప్రసాద్ అడపాక. 4 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు తీసుకుని హంగేరీ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు.
భవానీప్రసాద్ క్రికెట్‌లో రాణించడమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. టీవీ9 టీమ్ ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా తన వంతు సహకారాన్ని అందించాడు. హంగేరిలో అప్పుడు ఉన్న పరిస్థితులను టీవీ9 బృందానికి వివరించి, సరైన గైడెన్స్ ఇచ్చాడు భవానీ ప్రసాద్.
హంగేరిలో ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు క్రికెట్‌లో రాణిస్తున్న భవానీప్రసాద్‌పై ఇటు సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. భవానీప్రసాద్ ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని సొంత జిల్లా ప్రజలు, సిరిపురం గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Also Read: