ఫైనల్‌లో ఆ నాలుగు పరుగులు వద్దన్న స్టోక్స్!

| Edited By:

Jul 17, 2019 | 9:38 PM

లండన్: విశ్వవిజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే వారి ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో మార్టిన్ గప్తిల్ వేసిన త్రో అతి కీలకంగా మారింది. ఇక ఆ త్రోకు బాల్.. బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దానితో ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇచ్చారు. ఇక ఈ నిర్ణయాన్ని లెజెండరీ అంపైర్ సైమన్ టౌఫెల్ తప్పుబట్టడం జరిగింది. ఐసీసీ ఆర్టికల్ 19.8 ప్రకారం 5 పరుగులు […]

ఫైనల్‌లో ఆ నాలుగు పరుగులు వద్దన్న స్టోక్స్!
Follow us on

లండన్: విశ్వవిజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే వారి ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో మార్టిన్ గప్తిల్ వేసిన త్రో అతి కీలకంగా మారింది. ఇక ఆ త్రోకు బాల్.. బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దానితో ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇచ్చారు. ఇక ఈ నిర్ణయాన్ని లెజెండరీ అంపైర్ సైమన్ టౌఫెల్ తప్పుబట్టడం జరిగింది. ఐసీసీ ఆర్టికల్ 19.8 ప్రకారం 5 పరుగులు మాత్రమే ఇవ్వాలని.. కానీ అంపైర్లు తప్పుగా 6 పరుగులు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐసీసీ రూల్స్, అంపైర్ల పొరబాట్లపై అభిమానులు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఇక ఈ విషయంపై ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మాట్లాడుతూ… ‘ఓవర్ త్రో తర్వాత బెన్ స్టోక్స్ అంపైర్ల వద్దకు వెళ్లి.. ఎక్స్‌ట్రాగా వచ్చిన ఆ నాలుగు పరుగులను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాడని.. అయితే అంపైర్లు మాత్రం రూల్స్ ప్రకారమే ఆ పరుగులు ఇచ్చినట్లు చెప్పారట. ఇక ఈ విషయాన్ని స్టోక్స్.. మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌తో మాట్లాడుతుండగా విన్నానని ఆండర్సన్ మీడియాతో పంచుకున్నాడు.