Womens Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..

|

Nov 13, 2021 | 12:04 PM

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లోతొలిసారిగా క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే..

Womens Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..
Follow us on

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లోతొలిసారిగా క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కామన్వెల్త్‌ క్రికెట్‌ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. భారత మహిళల జట్టు తన మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. మహిళల క్రికెట్‌ ఈవెంట్స్‌కు సంబంధించి మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.

జులై 31న దాయాది దేశంతో..
గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌ ఉండగా.. గ్రూప్‌- బిలో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ జట్లు ఉండనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ టీ- 20 ఫార్మాట్‌లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక గానే జరుగనున్నాయి. 29న ఆస్ట్రేలియా మ్యాచ్‌ తర్వాత భారత్‌ 31న పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 3న బార్బడోస్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. రెండు గ్రూపులలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌ మ్యాచ్‌లు ఆగస్టు6న, జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు ఆగస్టు7న బంగారు పతకం కోసం, అదే రోజు సెమీస్‌లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాయి.

Also Read:

T20 World Cup 2021 Final: ఆసక్తికరంగా పొరుగు దేశాల మధ్య పోరు.. తొలి విజేతగా నిలిచేది ఎవరో?

India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌‌లో సత్తా చాటేందుకు రెడీ..!

India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు