భారత్ – ఆస్ట్రేలియా వన్డే.. టీమిండియాపై 17 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆసిస్ టీమ్..

సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసిస్ టీమ్ చెలరేగి ఆడింది. భారీ స్కోర్ నమోదు చేసి 17 ఏళ్ల క్రితం నమోదు చేసిన తమ రికార్డును తామే బద్దులు కొట్టారు కంగారూలు.

భారత్ - ఆస్ట్రేలియా వన్డే.. టీమిండియాపై 17 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆసిస్ టీమ్..
Follow us

|

Updated on: Nov 27, 2020 | 5:34 PM

సిడ్నీ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసిస్ టీమ్ చెలరేగి ఆడింది. భారీ స్కోర్ నమోదు చేసి టీమిండియాపై 17 ఏళ్ల క్రితం నమోదు చేసిన తమ రికార్డును తామే బద్దులు కొట్టారు కంగారూలు. భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో నేడు తొలి వన్డే జరిగింది. తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలం కావడంతో ఆట ఆరంభం నుంచే ఆసిస్ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడారు. బ్యాట్‌ను ఝుళిపించి నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్‌ను నమోదు చేశారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 374 పరుగుల చేశారు. ఈ స్కోర్ ఇప్పుడు రికార్డులకెక్కింది. 2003 సంవత్సరంలో జోహన్నస్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు 359/2 పరుగులతో రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. అయితే తాజా మ్యాచ్‌లో నమోదు చేసిన స్కోర్‌తో భారత్‌పై ఆస్ట్రేలియా నెలకొల్పిన పాత రికార్డు బద్దలైనట్లైంది.

కాగా, భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసిస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 374 పరుగులు నమోదు చేసింది. ఆసిస్ జట్టులో స్మిత్ మెరుపు ప్రదర్శన కనబరిచాడు. కేవలం 66 బంతుల్లోనే 106 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం సెంచరీ నమోదు చేశాడు. 124 బంతుల్లో 114 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్ 76 బంతుల్లో 69 పరుగులు, మాక్స్‌వెల్ 19 బంతుల్లో 45 పరుగులు చేసి టీమిండియాకు భారీ లక్ష్య ఛేదనను నిర్ధేశించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..