విధ్వంసం సృష్టించిన కంగారులు..తొలి వన్డేలో టీమిండియా ముందు 375 ప‌రుగుల భారీ టార్గెట్..

కంగారూ బ్యాట్స్ మెన్ లు విరుచుకుపడటంతో టీమిండియా బౌల‌ర్లు వణికిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కార‌ణ‌మైంది. స్మిత్ కేవ‌లం 62 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

విధ్వంసం సృష్టించిన కంగారులు..తొలి వన్డేలో టీమిండియా ముందు 375 ప‌రుగుల భారీ టార్గెట్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 27, 2020 | 2:59 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. కెప్టెన్ ఫించ్, మాజీ జట్టు సారథి స్టీవ్ స్మిత్ సెంచరీలతో వీరవిహారం చేశారు. దీంతో టీమిండియా ముందు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. భారత్ ముందు 375 పరుగుల భారీ టార్గెట్ ను పెట్టింది.

కంగారూ బ్యాట్స్ మెన్ లు విరుచుకుపడటంతో టీమిండియా బౌల‌ర్లు వణికిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కార‌ణ‌మైంది. స్మిత్ కేవ‌లం 62 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో 105 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ ఫించ్ 124 బంతుల్లో 114 ప‌రుగులు చేయగలిగాడు. మ‌ధ్య‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసం చేయడంతో కేవ‌లం 19 బంతుల్లోనే 45 ప‌రుగులు చేశాడు.

సిడ్నీ మైదానం వేదికగా భారత్‌-ఆసీస్‌ మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మొదట బ్యాటింగ్‌కు దిగింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. తొలి వన్డేలో భారీ స్కోర్‌ దిశగా ఆసీస్‌ ఇన్సింగ్స్‌ కొనసాగుతోంది. బ్యాటింగ్‌ పిచ్‌పై కంగారూ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు.