Anand Mahindra: టీమిండియాను గెలిపించిన ప్లేయర్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఆనంద్‌ మహీంద్ర.. గతంలో ఇచ్చిన మాటను..

|

Apr 03, 2021 | 5:13 PM

Anand Mahindra: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. ఓవైపు కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడిచే కంపెనీలను నడిపిస్తూనే మరో వైపు సమాజంలో జరుగుతోన్న విషయాలపై స్పందిస్తుంటారు ఆనంద్‌..

Anand Mahindra: టీమిండియాను గెలిపించిన ప్లేయర్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఆనంద్‌ మహీంద్ర.. గతంలో ఇచ్చిన మాటను..
Anand Mahindra Tweet
Follow us on

Anand Mahindra: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. ఓవైపు కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడిచే కంపెనీలను నడిపిస్తూనే మరో వైపు సమాజంలో జరుగుతోన్న విషయాలపై స్పందిస్తుంటారు ఆనంద్‌ మహీంద్ర. ముఖ్యంగా సమాజంలో జరిగే మంచి విషయాలు, స్ఫూర్తిదాయక వ్యక్తులను తన సోషల్‌ మీడియా పోస్టులతో ప్రపంచానికి పరిచయం చేస్తుంటారీ బడా వ్యాపారవేత్త.

ఈ క్రమంలోనే కొందరకి నగదు, మరికొందరికి వస్తువులను బహుమతిగా ఇస్తూ వార్తల్లో నిలుస్తాంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఇడ్లీ బామ్మకు ఇళ్లు, హోటల్‌ నిర్మించే పనులు మొదలు పెట్టిన ఆనంద్‌.. తాజాగా టీమిండియా యువ ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు యువ ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవ్‌దీప్‌. అయితే ఆ సిరీస్‌ గెలిచిన సమయంలో ఈ ఆరుగురు ఆటగాళ్లకు కార్లను బహుమతిగా ఇస్తానంటూ ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు. తాజాగా ఆ మాటను నిజం చేస్తూ ఆనంద్‌ మహీంద్ర సదరు ప్లేయర్స్‌కి మహీంద్రా థార్‌ ఎస్‌యూవీని బహుమతిగా అందించి మరో సారి వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఇక తమకు బహుమతిగా వచ్చిన కార్లతో ఫొటోలు దిగిన నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి టెస్టు ఓడినా.. తర్వాత టెస్టును గెలిచిన భారత్‌.. గొప్ప పోరాటంతో మూడో టెస్టును డ్రా చేసుకుంది. చివరిదైన నాలుగో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను నిలబెట్టుకుంది.

నటరాజన్ ట్వీట్..

శార్దూల్ ఠాకూర్ ట్వీట్..

Also Read: IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.? త్వరలోనే అధికారిక ప్రకటన.!

Cristiano Ronaldo: కోపంతో హ్యాండ్ బ్యాండ్​ విసిరికొట్టిన రొనాల్డో.. దాన్ని వేలం వేయగా ఎంత పలికిందే తెలిస్తే..

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్‌కు భారీ షాక్.. అల్‌రౌండర్ ఆక్సర్ పటేల్‌కు కరోనా పాజిటివ్..!